అమరజీవి త్యాగాలను మర్చిపోలేం
ABN, First Publish Date - 2022-12-15T23:14:52+05:30
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని కలెక్టర్ దినే్‌షకుమార్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్ గంగాడ సుజాతతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని కలెక్టర్ దినే్‌షకుమార్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్ గంగాడ సుజాతతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో పొట్టిశ్రీరాములు ప్రాణార్పణం చేసిన ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొని పలు పర్యాయాలు జైలుకు వెళ్ళిన సమరయోధుడు శ్రీరాములు అని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అదికారి అంజల, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ వెంకటేశ్వరరావుతోపాటు పలుశాఖల అధికారులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు
కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌లో పొట్టిశ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డీఆర్వో ఓబులేషు ఈ సందర్భంగా శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో శ్రీరాములు చేసిన త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, రెవెన్యూ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు ఉతకోలు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-12-15T23:14:55+05:30 IST