ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజు రోజుకు పెరుగుతున్న తాగునీటి సమస్య

ABN, First Publish Date - 2022-06-25T06:20:48+05:30

వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవక పోవడంతో ఎర్రగొండపాలెం మండలంలో తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది.

తుమ్మడపల్లిలో నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాగునీటి బోర్లలో అడుగంటుతున్న భూగర్భజలాలు

ఎర్రగొండపాలెం,  జూన్‌ 24 : వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవక పోవడంతో ఎర్రగొండపాలెం మండలంలో తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో ప్రజలు నీటికోసం ట్యాంకర్లుపైనే ఆధారపడుతున్నారు.  మండలంలో  ఇప్పటికీ, నిత్యం 240 ట్యాంకర్లు నీటిని ప్రజలకు వ్యవసాయబోర్ల నుంచి సేకరించి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు వచ్చిన సమయంలో ప్రజలు బిందెడు నీటికోసం పడిగాపులు కాచి నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. మండలంలో అమానిగుడిపాడు గ్రామంలో 40 ట్యాంకర్లు,  అయ్యంబొట్లపల్లి 12 ట్యాంకర్లు, బట్టువారిపల్లె 4,  చిన్నబోయలపల్లి 5, చిన్నకొలుకుల 5, చెన్నరాయునిపల్లి 6, గంగుపల్లి 15,  గురిజేపల్లి 4, గుర్రపుసాల 12 ట్యాంకర్లు,  వాదంపల్లి 26 ట్యాంకర్లు, కాశికుంటతాండ 8, మెట్టబోడుతాండ 2,  మొగుళ్లపల్లి 9,  మిల్లంపల్లి పంచాయతీలో వికెనగర్‌ 15, మురారిపల్లె 39 ట్యాంకర్లు, వెంకటాద్రిపాలెం 18, రేగులపల్లి 4,  తమ్మడపల్లి గ్రామంలో 11 ట్యాంకర్లు నీటిని ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా సర్పంచులు ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తున్నారు. వర్షాలు కురిస్తే తాగునీటి బోర్లలో భూగర్భజలాలు పెరుగుతాయని ప్రజలు వర్షాలు కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిసేనా తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేనా అన్నట్లుగా తాగునీటి సమస్య నెలకొంది.

Updated Date - 2022-06-25T06:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising