ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ వాళ్లకే పథకం.. మీక్కాదు!

ABN, First Publish Date - 2022-08-05T04:59:53+05:30

ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్తున్నది ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో లేదన్నది గోసులవీడు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వైఖరి నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మండలపరిధిలోని గోసులవీడు పంచాయతీలోని వాగుపల్లిలో పోకూరి బాలయ్య తన భార్య పిచ్చమ్మ పేరు మీద నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం సచివాలయానికి వెళ్లాడు. వారితో పాటు వాగుపల్లిలో కొంతమంది చేనేత కుటుంబాల వారు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు.

యంపీడిఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాలయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అతి

నేతన్న దరఖాస్తు తిరస్కరణ

ఆర్డీవో, ఎంపీడీవో వద్ద గోడువెళ్లగక్కిన బాధితుడు

కనిగిరి, ఆగస్టు 4: ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్తున్నది  ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో లేదన్నది గోసులవీడు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వైఖరి నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మండలపరిధిలోని గోసులవీడు పంచాయతీలోని వాగుపల్లిలో పోకూరి బాలయ్య తన భార్య పిచ్చమ్మ పేరు మీద నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం సచివాలయానికి వెళ్లాడు. వారితో పాటు వాగుపల్లిలో కొంతమంది చేనేత కుటుంబాల వారు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. కానీ పిచ్చమ్మకు చెందిన దరఖాస్తును మాత్రం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తీసుకోలేదు. దీంతో అర్హత ఉన్న తమ దరఖాస్తును ఎందుకు తీసుకోవడం లేదని బాలయ్య నిలదీశాడు. వైసీపీ వాళ్లకే సరిపోయాయని, మీకు అవకాశం లేదని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఛీత్కరించుకున్నాడు. పథకాలు అందరికీ సమానం కదా, మా దరఖాస్తు ఎందుకు తీసుకోరని, ఇదక్కెడి న్యాయమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య ఆర్డీవో సందీప్‌కుమార్‌కు, ఎంపీడీవోకు న్యాయం చేయాలని గురువారం వినతిపత్రం అందచేశాడు. 


Updated Date - 2022-08-05T04:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising