ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతిని ప్రగతి పధంలో నడిపించాలి

ABN, First Publish Date - 2022-08-08T03:53:13+05:30

భరత జాతిని ప్రగతి పధంలో నడిపించాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు అన్నారు.

తిరంగా ర్యాలీ ప్రారంభిస్తున్న కమిషనర్‌ నారాయణరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతకు మున్సిపల్‌ కమిషనర్‌ 

నారాయణరావు పిలుపు

కనిగిరి, ఆగస్టు 7 : భరత జాతిని  ప్రగతి పధంలో నడిపించాల్సిన బాధ్యత  యువత చేతుల్లోనే ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు అన్నారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరంగా ర్యాలీ ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాటా డుతూ ప్రపంచంలోనే భారతదేశానికి ఎంతో గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న దేశం గా మహోన్నత గుర్తింపు ఉందన్నారు. నేటి సమాజంలో యువత ఆధునిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన తరుణంలో అదే ఆఽధునిక పరిఙ్ఞానంతో చెడు మార్గాలను పట్టడం బాధాకరమన్నారు. మన దేశంలో యువతకు ఉన్న శక్తి మరే దేశంలో లేదని, ఆ శక్తిని యువత సన్మార్గంలో ఉపయో గించుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేయాలన్నారు. చైర్మన్‌ గఫార్‌ మాట్లాడుతూ 75 ఏళ్ళ స్వతంత్య్ర భారతావని ఎందరో మహ నీయుల ప్రాణత్యాగాల ఫలితమే అని అన్నా రు. ఆ మహనీయులను భవిష్యత్‌ తరాలు గు ర్తుంచుకునేలా నేటి తరం కృషి చేయాలని కో రారు. కార్యక్రమంలో సీఐ పాపారావు, ఎస్‌ఐ ప్రసాద్‌, జాతీయవాసవి సత్ర సముదాయాల చైర్మన్‌ దేవకి వెంకటేశ్వర్లు, యంపీడీఓ మల్లి కార్జునరావు, వైస్‌ చైర్మన్‌ పులిశాంతి, కౌన్సిలర్‌ దేవకి సత్యవతి, దేవకి రాజీవ్‌ పాల్గొన్నారు.  

ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు 

దొనకొండ : మండల కేంద్రమైన దొన కొండలో సర్పంచ్‌ కొంగలేటి గ్రేస్‌ రత్నకుమారి నేతృత్వంలో అజాదీకా అమృత మహోత్సవాల్లో బాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం  ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాల యం లో నిర్వహించారు. సర్పంచ్‌ రత్నకుమారి, దేవానంద్‌, ఎంపీడీవో షేక్‌ దావూద్‌, ఎస్సై  అంకమ్మ, ఎంఈవో సాంబశివరావు, ఏపీవో దేవయ్య,  ఏపీఎం వెంకటేశ్వర్లు స్వాతంత్య్ర పోరాటం, మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. వారికి నివాళులర్పించారు. ప్రతి ఇం టిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కో రారు. అనంతరం గ్రామ పంచాయితీ కార్యా లయం నుంచి పురవీదుల్లో ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, వలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T03:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising