ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందిని మేతకొదిలారు శనగ దున్నేస్తున్నారు

ABN, First Publish Date - 2022-01-24T04:58:52+05:30

తెగుళ్ల దెబ్బకు రైతులు విలవిల్లాడుతున్నారు. పచ్చని కందిపైరు చివరకు జీవాలకు మేతైంది. వర్షాలకు తోడు వైరస్‌తో శనగను రైతులు దున్నేస్తున్నారు. పీసీపల్లి మండలం పెద్దన్నపల్లికి చెందిన రైతు నెలకుర్తి మాల్యాద్రి 20 ఎకరాల్లో కంది సాగుచేశాడు. ఇటీవల కురిసిన వానలతో పైరు ఏపుగా పెరిగి పూత పిందె లేకుండా ఆకులు చెండు కట్టిపోయింది.

పీసీపల్లిలో కంది పైరును మేస్తున్న గొర్రెలు, మేకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పీసీపల్లి, నాగులుప్పలప్పాడు(ఒంగోలురూరల్‌), జనవరి 23 :  తెగుళ్ల దెబ్బకు రైతులు విలవిల్లాడుతున్నారు. పచ్చని కందిపైరు చివరకు జీవాలకు మేతైంది. వర్షాలకు తోడు వైరస్‌తో శనగను రైతులు దున్నేస్తున్నారు. పీసీపల్లి మండలం పెద్దన్నపల్లికి చెందిన రైతు నెలకుర్తి మాల్యాద్రి 20 ఎకరాల్లో కంది సాగుచేశాడు. ఇటీవల కురిసిన వానలతో పైరు ఏపుగా పెరిగి పూత పిందె లేకుండా ఆకులు చెండు కట్టిపోయింది. ఇప్పటివరకు రూ.2.5లక్షలు పెట్టుబడి పెట్టాడు. విత్త నం వేసి ఏడు నెలలు కావస్తున్నా పూత, పిందె రాలేదు. దీంతో ఆశలు వదిలేసుకుని గొర్రెలను మేపుకునేందుకు కాపరులకు వదిలేశాడు. ఆదివారం గ్రామంలోని కాపరులు కందిచేలో జీవాలను తోలి మేపుతున్న దృశ్యం ఆంధ్రజ్యోతి కంటపడింది.  

 అలాగే శనగపంటకు తెగుళ్లు రావటంతో జిల్లాలో చాలాచోట్ల రైతులు దున్నేస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో సాగు చేసిన శనగ పైరును ఆదివారం ట్రాక్టర్లతో దున్నడం ఆంధ్రజ్యోతి కంటపడింది. ఆ గ్రామపరిధిలో 80 శాతంపైగా శనగ సాగు చేశారు. అయితే వర్షాల కారణంగా ముదురు శనగకు ఎండు తెగులు రావడంతో 20 ఎకరాల్లో తీసేశారు. ఇప్పటికే రైతులు ఎకరానికి 20వేలకు పైగా ఖర్చు చేశారు. చుట్టుపక్కల మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.




Updated Date - 2022-01-24T04:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising