ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెవనం పరిశుభ్రం

ABN, First Publish Date - 2022-12-15T22:56:34+05:30

మండలంలోని గంగదొనకొండ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పల్లెవనం పేరుతో రు.8 లక్షల వ్యయంతో పార్కును ఏర్పా టు చేశారు. ఆలనాపాలనా లేకపోవడంతో పార్కులో చిల్లచెట్లు మొలిచి అక్కడకు గ్రామస్థులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

పరిశుభ్రమైన పల్లెవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన

కురిచేడు, డిసెంబరు 15: మండలంలోని గంగదొనకొండ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పల్లెవనం పేరుతో రు.8 లక్షల వ్యయంతో పార్కును ఏర్పా టు చేశారు. ఆలనాపాలనా లేకపోవడంతో పార్కులో చిల్లచెట్లు మొలిచి అక్కడకు గ్రామస్థులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో పల్లెవనంపై పగ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై ఎంపీడీవో భవ్య, ఈవో ఆర్డీ నరేష్‌ పల్లెవనాన్ని పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయించాలని సర్పంచ్‌, పం చాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గంగదొనకొండ సర్పంచ్‌ గురువారం ఎక్స్‌ వేటర్‌ సాయంతో పల్లెవనంలో పిచ్చి చెట్లు తొలగించారు. మొత్తం శుభ్రం చేయించి గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఎంపీడీవో భవ్య తెలిపారు. ఇదే విషయాన్ని డీఆర్‌డీఏ పీడీ శీనారెడ్డి కూడా అమరావతిలోని గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు తెలియజేశారు. ఆంధ్రజ్యోతి కథనంతో గ్రామంలోని పల్లెవనం బాగుపడిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-15T22:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising