ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ ఘటన ప్రభుత్వ వైఫల్యమే

ABN, First Publish Date - 2022-05-26T05:11:46+05:30

కోనసీమలో జరిగిన హింసాకాండకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని పలువురు చీరాల దళిత నాయకులు అన్నారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరును జత చేయడంపై ఇటీవల కాంలో జరుగుతున్న ఘటనలపై బుధవారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ పేరును జిల్లాకు జతపరచడాన్ని వ్యతిరేకిస్తూ దళిత మంత్రిపై, బీసీ ఎమ్మెల్యేపై దాడులు జరగడం అమానుషమన్నారు. దీనిపై కొన్ని రాజకీయ మనువాద శక్తులు ఘటనను ప్రేరేపిస్తున్నట్లు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న పలువురు దళిత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దళిత నాయకులు

చీరాలటౌన్‌, మే 25 : కోనసీమలో జరిగిన హింసాకాండకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని పలువురు చీరాల దళిత నాయకులు అన్నారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరును జత చేయడంపై ఇటీవల కాంలో జరుగుతున్న ఘటనలపై బుధవారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ పేరును జిల్లాకు జతపరచడాన్ని వ్యతిరేకిస్తూ దళిత మంత్రిపై, బీసీ ఎమ్మెల్యేపై దాడులు జరగడం అమానుషమన్నారు. దీనిపై కొన్ని రాజకీయ మనువాద శక్తులు ఘటనను ప్రేరేపిస్తున్నట్లు తెలిపారు.  సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు లేని అడ్డంకులు కోనసీమకు ఎందుకు వచ్చాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిచ్చారు. దళితులకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతుండటం కూడా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఈనేపథ్యంలో చీరాల ప్రాంతంలో శాంతియుత ర్యాలీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి, బలహీన వర్గాల సమాఖ్య రాష్ట్ర నాయకులు గోసాల ఆశీర్వాదం,  సీపీఎం నాయకులు బాబురావు, ప్రజాసంఘాల నాయకులు గోసాల సుధాకర్‌, దామర్ల శ్రీకృష్ణ, కంచర్ల చిట్టిబాబు, చిరంజీవి, గుమ్మడి చినబాబు, మార్పు దీనరాజు, గోసాల అశోక్‌, రామస్వామి  మాట్లాడారు.


Updated Date - 2022-05-26T05:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising