ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పోలేరమ్మ దేవాలయ వార్షిక తిరునాళ్ల

ABN, First Publish Date - 2022-06-25T05:29:29+05:30

మండలంలోని గుంటుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న సట్టు పోలేరమ్మ దేవాలయ ప్రథమ వార్షిక తిరునాళ్ల శుక్రవారం వైభవంగా జరి గింది.

విద్యుత్‌ దీపాల ఆలంకరణలో పోలేరమ్మ దేవాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బల్లికురవ, జూన్‌ 24: మండలంలోని గుంటుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న సట్టు పోలేరమ్మ దేవాలయ ప్రథమ వార్షిక తిరునాళ్ల శుక్రవారం వైభవంగా జరి గింది. గ్రామస్థులు సమిష్టి కృషితో దేవాలయం వద్ద విద్యుత్‌ ప్రభను ఏర్పాటుచేశారు. మొక్కుబడుల ప్రభ లను కూడా ఏర్పాటుచేసి పాట కచేరీలు నిర్వహించా రు. కోలాట భజనలు భక్తులను అకట్టుకొన్నాయి. 

గుంటుపల్లి, కొత్తపాలెం గ్రామాలకు చెందిన భక్తు లు పెద్దఎత్తున తరలివచ్చారు. పోలేరమ్మ, లక్ష్మీదేవి, నాంచారమ్మ, అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. దేవాలయ  అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మాదాల వీరమ్మ ఆధ్వర్యంలో  భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ కుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలేరమ్మ ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం చేపట్టారు. గ్రామస్థులు, దాతల సహకారం తో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే ప్రాంగణంలో ఉన్న దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరిం చారు.

తిరుణాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్‌

గుంటుపల్లి లో సట్టు పోలేరమ్మ దేవాలయం వార్షిక తిరుణాళ్ల వేడుకలలో శు క్రవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  కార్యక్రమంలో టీడీపీ నేతలు మలినేని గోవిందరావు, కొండేటి ఇస్రాయిల్‌, ధూళిపాళ్ళ హనుమంతరావు, వీరాంజనేయలు,, ఏడుకొండలు, గొట్టిపాటి శంకర్‌, మాదాల వీరమ్మ , సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

మేదరమెట్ల, జూన్‌ 24: రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉం డాలని సుబ్రహ్మణ్య స్వామి వద్ద కోరుకున్నట్లు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని కృష్ణంరాజువారి పాలెం(రెడ్డిపాలెం)లో ఇటీవల ప్రతిష్ఠించిన 45 అడుగుల ఎకశిల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి రవికుమార్‌ పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ విశిష్టత గురించి, గత 40 సం వత్సరాలుగా అక్కడ జరుగుతున్న పూజా కార్యక్ర మాల గురించి నిర్వహకులు ఆయనకు వివరిం చారు.  కార్యక్రమంలో రవికుమార్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising