ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికాబద్ధంగా బోధన సాగాలి

ABN, First Publish Date - 2022-07-04T05:06:37+05:30

ఉపాధ్యా యులు ప్రణాళికాబద్ధంగా బోధన చేస్తే విద్యా ర్థులు ఉత్తమ ఫలి తా లు సాధిస్తారని కలెక్టర్‌ ఏఎన్‌ దినే ష్‌కుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయులకు కలెక్టర్‌ దిశానిర్దేశం

తర్లుపాడు, జూలై 3 : ఉపాధ్యా యులు ప్రణాళికాబద్ధంగా బోధన చేస్తే విద్యా ర్థులు ఉత్తమ ఫలి తా లు సాధిస్తారని  కలెక్టర్‌ ఏఎన్‌ దినే ష్‌కుమార్‌ అన్నారు. మండలం లో ని కలుజువ్వలపాడు జవహర్‌ లాల్‌ నవోదయ విద్యాలయంలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు ఆదివారం వర్క్‌ షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాల ప్రారంభం రోజు నుంచే విద్యార్థులు విద్యపై దృష్టి సారించేలా చేయాలన్నారు. నూతన ఆలో చనలు ఆశయాలతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలన్నారు. నాణ్యమైన ఉపాధ్యా యుల ద్వారానే మెరుగైన బోధన విద్యార్థులకు అందుతుందన్నారు. ఆ దిశగా సమర్థవంతమైన టీచింగ్‌  లెర్నింగ్‌ మెథడాలజీని అనుసరించాలని సూచించారు. ఒక్కో పీరియడ్‌లో విద్యార్థులకు 15 నిమిషాలు మాత్రమే ఏకాగ్రత ఉంటుందన్నారు. పూర్తి స్థాయిలో విద్యార్థులు పాఠాలు వినేలా ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను అనుసరించాలన్నారు.  ప్రధా నోపాధ్యాయులందరూ తప్పనిసరిగా క్లాస్‌లు తీసుకొని  బోధన చేయాలని తెలిపారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చేస్తున్న బోధనను ప్రత్య క్ష్యంగా పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాలని మండల స్థాయి పర్యవేక్షక బృందా లకు కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థుల సామార్థ్యాలను తెలుసుకునేలా బేస్‌ లైన్‌ పరీక్ష నిర్వహించి వారి లోపాలను సరిదిద్దేలా ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్‌ఎంలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత టెక్నాలజీపై  పట్టు సాధించి విద్యార్థులకు డిజిటల్‌ లిటరిసీపై  అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో లైబ్రరీలు ఇతర మౌలిక వస తులు ప్రారంభం నుంచే కల్పించాలన్నారు. పాఠశాల నిర్వాహణ నిధుల కోసం రూ.20 కోట్ల నిధులు ఉన్నా యని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తెలి పారు. విద్యా కానుక కిట్లు అందరికీ పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాలలో  తల్లిదం డ్రుల కమిటీ సమావేశం కచ్చితంగా నిర్వహించాలని, వి ద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి భవిష్యత్‌పై తల్లిదండ్రులకు సలమాలు ఇవ్వాలన్నారు. ప దో తరగతి పూర్తైన బాలికలు ఇంటర్‌లో చేరేలా హెచ్‌ఎంలు పర్యవేక్షించాలని సూ చించారు. కార్యక్ర మంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌భాస్కర్‌, సీఈవో సుబ్బా రావు, జవహర్‌ నవోదయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T05:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising