ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2022-01-22T06:17:34+05:30

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల మంజూరు, భూముల ఆన్‌లైన్‌ ముటేషన్‌ చేసేందుకు లంచాలు డిమాండ్‌ చేసేవారిని ఉపేక్షించేది లేదని అందుకు బాధ్యులైన అధికారులను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, జనవరి 21: ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల మంజూరు, భూముల ఆన్‌లైన్‌ ముటేషన్‌ చేసేందుకు లంచాలు డిమాండ్‌ చేసేవారిని ఉపేక్షించేది లేదని అందుకు బాధ్యులైన అధికారులను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అఽధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వారసత్వంగా వస్తున్న భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు పట్టణ వీఆర్వో చెన్నకేశవులు, నుచ్చుపొద వీఆర్వో మెండా వెంకటేశ్వర్లు రూ.30వేలు వంతున ముడుపులు ఇచ్చినా పనులు చేయడం లేదని నియోజకవర్గ వైసీపీ ముస్లీం మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ ఖాదర్‌బాష సమీక్షా సమావేశంలో ఆరోపించారు. అందుకు ఎమ్మెల్యే   మధుసూదన్‌ యాదవ్‌ వీఆర్వో నుంచి వివరణ కోరగా తనకు రూ. 30వేలు కాదని, రూ. 20వేలు ఇచ్చాడని వీఆర్వో చెన్నకేశవులు పేర్కొన్నారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే తక్షణం వీఆర్వోతో పాటు చిలంకూరులో తెల్లరాయి నిక్షేపాల మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన సంబంధిత పంచాయతీ కార్యదిర్శపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచిసస్పెండ్‌ చేయాలని తహశీల్దార్‌ సీహెచ్‌ ఉషకు, సీఐ కొండవీటి శ్రీనివాసరావుకు సిఫార్సు చేశారు. ఎన్నిమార్లు హెచ్చరిస్తున్న అధికారుల్లో మార్పురావడం లేదని ఇష్టంలేని వారు బదిలీపై వెళ్లవచ్చని సూచించారు. అర్హులైన వాస్తవ లబ్దిదారులందరికీ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి మండలాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.  సమావేశంలో ఎంపీపీ గంగసాని లక్ష్మీ, సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ పువ్వాడి వెంకటసుజాత, జడ్పీటీసీ సీహెచ్‌ సుబ్బయ్య, వైస్‌ ఎంపీపీలు షేక్‌ రషీద్‌, గంధం ఏసురత్నం, వైవీ సాయికిరణ్‌, తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష, ఎంపీడీవో ఎం.రంగసుబ్బరాయుడు, సీఐ కొండవీటి శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ వి బ్రాహ్మనందరెడ్డి, పలుశాఖల అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising