కేజీబీవీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ABN, First Publish Date - 2022-10-18T05:29:42+05:30
మర్రిపూడి కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కేసీహెచ్ సీతాబాయిని సస్పెండ్ చేశారు.
నాడు-నేడు పనుల్లో అవకతవకలే కారణం
ఇన్‌చార్జిగా నిర్మలకు బాధ్యతలు
ఒంగోలు(విద్య), అక్టోబరు 17 : మర్రిపూడి కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కేసీహెచ్ సీతాబాయిని సస్పెండ్ చేశారు. ఆ మేరకు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి.విజయభాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. మనబడి నాడు-నేడు కింద చేపట్టిన పనులకు సరఫరా చేసిన ఇనుము, ఇటుక, ఇసుక తగిన పరిమాణం, నాణ్యత లేకపోవడంతో పాటు బిల్లుల్లో అవకతవకల జరిగినట్లు ఫిర్యాదు రావడంతో ఇటీవల విచారణకు ఆదేశించారు. మర్రిపూడి మండల ప్రత్యేక అధికారి అయిన డీఎస్‌వో శ్యాంకుమార్ విచారణ చేసి నివేదికను అందజేశారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో సీతాబాయిని సస్పెండ్ చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఎల్.నిర్మలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు విజయభాస్కర్ తెలిపారు.
Updated Date - 2022-10-18T05:29:42+05:30 IST