ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరఫరా పునరుద్ధరణ!

ABN, First Publish Date - 2022-08-10T05:55:05+05:30

బిల్లుల బకాయిలు చెల్లించే గడువును వచ్చేనెల 10 వరకు విద్యుత్‌ శాఖ పొడిగించింది. ఆ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు సరఫరాను పునరుద్ధరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బకాయిల చెల్లింపునకు  వచ్చేనెల 10వరకు గడువు పొడిగింపు

కలెక్టర్‌తో సమావేశమైన విద్యుత్‌ అధికారులు

బడ్జెట్‌ తెచ్చుకోవాలని ఇతర శాఖలకు ఆదేశాలు

ఒంగోలు (క్రైం), ఆగస్టు 9 : బిల్లుల బకాయిలు చెల్లించే గడువును వచ్చేనెల 10 వరకు విద్యుత్‌ శాఖ పొడిగించింది. ఆ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు సరఫరాను పునరుద్ధరించింది. ‘బడ్జెట్‌ లేదు బకాయిలెలా..?’ అన్న శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పందించారు. విద్యుత్‌ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ సత్యనారాయణ, ఇతర అధికారులు బకాయిల గురించి కలెక్టర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో సంప్రదించారు. చాలా శాఖలకు బడ్జెట్‌ సమస్య ఉందని, వచ్చేనెల 10 వరకు గడువు ఇవ్వాలని కోరారు. వారు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలకు కలెక్టర్‌ ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, బకాయిలు ఉన్నవారు బడ్జెట్‌ను తెప్పించుకునేందుకు ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని కోరారు. వచ్చేనెల 10లోపు  బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, రక్షిత మంచినీటి పఽథకాలకు విద్యుత్‌ సరఫరాను ఆ శాఖ అధికారులు పునరుద్ధరించారు.



Updated Date - 2022-08-10T05:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising