ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగట్లో భూసార పరీక్ష పత్రాలు

ABN, First Publish Date - 2022-08-15T04:52:28+05:30

భూమి నాణ్యతను పరీక్షించి తగిన పంటలను, ఎరువుల మోతాదును సూచించేందుకు ఉపకరించే భూసార పరీ క్ష పత్రాలు అంగడి సరుకుల్లా మారిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రూ.వెయ్యి ఇస్తే అనుకూలంగా నివేదిక

పండ్లతోటల రాయితీకి తప్పనిసరి

సొమ్ము చేసుకుంటున్న ల్యాబ్‌ నిర్వాహకులు


బేస్తవారపేట, ఆగస్టు 14 : భూమి నాణ్యతను పరీక్షించి తగిన పంటలను, ఎరువుల మోతాదును సూచించేందుకు ఉపకరించే భూసార పరీ క్ష పత్రాలు అంగడి సరుకుల్లా మారిపోతున్నాయి. ఉపాధిహామీ పథకం ద్వారా సా గు చేసే పండ్లతోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందాలంటే ప్రభుత్వం భూసార పరీక్షలను తప్పనిసరి చేసింది. దీంతో రాయితీపై పండ్లతోటలు సాగుచేసేందుకు ప్రతి రైతు భూసార పరీక్షపత్రాలు సమర్పించాల్సి ఉంది. దీన్ని కొంతమంది ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు, ప్రభుత్వ శాఖల్లోని కొంత మంది అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.


ఫలితాలు తప్పనిసరి కావడంతో..

జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంలో పండ్లతోటల సాగుకు ప్రోత్సాహం అందాలంటే భూసార పరీక్షల పత్రం తప్పనిసరి. ఆర్‌బీకేలోని వ్యవసాయ సహాయకులు తగు ప్రమాణాలకు అనుగుణంగా మట్టి నమూనాలు సేకరించి జిల్లాలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి. అక్కడి నుంచి వచ్చిన ఫలితాల ప్రకారం ఆ భూమి పండ్లతోటలకు అనుకూలంగా ఉంటుందా..? ఉండదా..? అనేది నిర్ధారించుకోవాలి. అయితే అధికార యంత్రాంగం ఆ బాధ్యతను రైతులపైకే నెట్టింది. దీంతో వారు పత్రాల కోసం మధ్యమ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. రూ.వెయ్యి ఇస్తే అనుకూలంగా ఫలితంగా ఇచ్చే ల్యాబ్‌లు ఉండటంతో ఖర్చు ఎక్కువైనా తప్పక వాటిని ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రభుత్వ భూసారపరీక్ష కేంద్రంలోని అధికారులు కూడా తక్షణ ఫలితాల కోసం రూ.వెయ్యి మామూళ్లు తీసుకొని వెంటనే ధ్రువపత్రాల మంజూరు ఇస్తుండటం గమనార్హం.


నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం 

భూసార పరీక్ష కోసం మట్టి నమోనాలు సేకరించడానికి మొదటి అరడుగు పొర తీసేసి గుంట తవ్వి మట్టి సేకరిస్తారు. సాగు చేసే పంటను బట్టి ఎంత లోతు వరకు  తవ్వాలో నిర్ధారించాల్సి ఉంది. పండ్లతోటల సాగు కోసం ఆరుగుల వరకు గుంట తీసి ప్రతి అడుగులో కొంత మట్టిని సేకరించాలి. ఇక సాగయ్యే భూమిలో కూడా వివిధ ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించాలి. అందుకోసం నిపుణులైనా వ్యవసాయ సహాయకులు ఉన్నప్పటికీ, రైతులే ఈ పరీక్షల కోసం మట్టి సేకరిస్తున్నారు. కేవలం ధ్రువపత్రం కోసం అన్నట్లు ప్రమాణాలు పట్టించకుండా రైతులు నమూనాలు సేకరిస్తుండగా, అటు, ప్రభుత్వ ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు కూడా కేవలం రూ.వెయ్యి కోసం అన్నట్లు ఇష్టానుసారం నివేదికలు అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.  


గత టీడీపీ హయాంలో భూసార పరీక్షలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వ్యవసాయాధికారుల ద్వారా గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి, బోర్డులు ఏర్పాటు చేయించి గ్రామాల్లో వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం భూసార పరీక్షలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. ఎవరైనా పరీక్షలు చేయించుకుని సంబంధిత పత్రాలు కావాలంటే నేరుగా రైతులు ఒంగోలులోని కార్యాలయానికి వెళ్లి నామమాత్రపు ఫీజు రూ.10 చెల్లించి  ఫలితాలు పొందాల్సి ఉంది.

Updated Date - 2022-08-15T04:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising