ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ల్యాబ్‌ల ద్వారా భూసార పరీక్ష సర్టిఫికెట్లు

ABN, First Publish Date - 2022-08-19T04:35:15+05:30

భూసార పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్‌లను ప్రభుత్వ ల్యాబ్‌ల నుంచి రైతులు పొందాలని అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేస్తవారపేట, ఆగస్టు 18 : భూసార పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్‌లను ప్రభుత్వ ల్యాబ్‌ల నుంచి రైతులు పొందాలని అధికారులు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించవద్దని సూ చించారు. ఈనెల 15న ఆంధ్రజ్యోతిలో అంగట్లో భూసార పరీక్ష పత్రాలు అనే కథనంపై డీ-2 ఏవో ఎస్‌.శ్రీనివాసరావు స్పందించారు. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులకు ఆదే శాలు ఇచ్చారు. దీంతో గురువారం నుంచి గ్రామీణ వ్యవసాయ, ఉద్యాన, సెరీకల్చర్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని కొత్తపల్లె గ్రామంలో కంభం ఉధ్వాన శాఖ అధికారి డి.శ్వేత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పండ్ల తోటల సాగుకు భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు సేకరించాలంటే 3 నుంచి 4 అడుగుల లోతు తవ్వి అడుగుకొక శాంపిల్స్‌ తీసుకోవాలన్నారు. ఈవిధంగా తీసుకున్న నాలుగు శాంపిళ్లను విడివిడిగా సాయిల్‌ టెస్టుకి పంపాలని సూ చించారు. మట్టిని ప్రభుత్వ ల్యాబులకు అందిస్తే రూ.10 చెల్లించి భూసార సర్టిఫికెట్‌ను పొందవచ్చని ఆమె రైతులకు తెలిపారు.  


Updated Date - 2022-08-19T04:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising