ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా.. ‘బ్యాంకు మేనేజరు’ పోస్టు ఎక్కడో చూపించండి!

ABN, First Publish Date - 2022-08-04T07:09:25+05:30

నేను సప్లయ్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తుంటాను. భార్య లేదు. ఇద్దరు పిల్లలు.. వారిలో ఆడపిల్లకు మాటలు రావు.. అయినా ప్రభుత్వం కనికరం చూపడం లేదు. పిల్లలకు అమ్మఒడి రాలేదని అడిగితే నువ్వు బ్యాంకు మేనేజర్‌ అంటున్నారు.

బాలినేనికి సమస్య చెప్పుకుంటున్న సోమేష్‌ను పక్కకు లాగుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పేరుతో మూడేళ్లుగా అమ్మఒడి లేదు 

ఒంగోలులో పింఛన్‌ల పంపిణీ వద్ద ఓ కూలీ ఆవేదన

ఒంగోలు (కార్పొరేషన్‌), : ‘నేను సప్లయ్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తుంటాను. భార్య లేదు. ఇద్దరు పిల్లలు.. వారిలో ఆడపిల్లకు మాటలు రావు.. అయినా ప్రభుత్వం కనికరం చూపడం లేదు. పిల్లలకు అమ్మఒడి రాలేదని అడిగితే నువ్వు బ్యాంకు మేనేజర్‌ అంటున్నారు. అమ్మఒడి అయినా ఇప్పించండి. లేదా బ్యాంకు మేనేజరు పోస్టు ఎక్కడో చూపించండి’ అని ఒంగోలుకు చెందిన తుమ్మా సోమేష్‌ వేడుకున్నారు. బుధవారం స్థానికంగా జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేనికి తన సమస్యను విన్నవించుకుంటుండగా అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు పక్కకు లాగేశారు. తన కుమార్తెకు పెన్షన్‌ కోసం వచ్చిన సోమేష్‌ గత మూడేళ్లుగా తనకు జరుగుతున్న అన్యాయంపై వాపోయారు.  పనికిమాలిన ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగిందేమీలేదని విరుచుకుపడ్డారు. మూడేళ్లుగా ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాను కొన్నేళ్లుగా ఒంగోలులోని రిక్షాల బజారులో ఉంటున్నానని తెలిపారు. ఏ ప్రభుత్వ పథకం తనకు రావడం లేదన్నారు.విద్యాశాఖ అధికారులు, కార్పొరేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయే తప్ప న్యాయం జరగడం లేదన్నారు. అదేమంటే ఆధార్‌ నెంబరు కొడితే స్టేట్‌బ్యాంకు మేనేజరు అని చూపిస్తోందని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. చదువులేదు.. రోజూ పనికి వెళ్లి జీవనం సాగించే తాను బ్యాంకు మేనేజరు ఎలా అవుతానని అతను ప్రశ్నించాడు. ఇప్పటికైనా తనకు జరిగిన అన్యాయంపై పరిశీలన చేసి, న్యాయం చేయాలని సోమేష్‌ కోరుతున్నారు.  



Updated Date - 2022-08-04T07:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising