ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కణితిని వేటాడిన ఏడుగురి అరెస్టు

ABN, First Publish Date - 2022-12-07T22:03:15+05:30

కణితిని వేటాడి చంపిన ఏడుగురిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కణితి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిరసన తెలుపుతున్న దిగువమెట్ట గ్రామస్థులు .. అరెస్టు చేసిన వారిని చూపిస్తున్న ఫారెస్ట్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమంగా అరెస్టు చేశారని గ్రామస్థుల నిరసన

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 7 : కణితిని వేటాడి చంపిన ఏడుగురిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కణితి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం దిగువమెట్ట గ్రామానికి చెందిన కొంతమంది అడవిలో రెండు రోజులక్రితం కణితిని వేటాడారు. సమాచారం మేరకు వారి వద్ద తనిఖీ చేయగా కణితి కళేబరం ఉండడంతో ఏడుగురిని అరెస్టు చేసినట్లు నరసింహారావు తెలిపారు. కళేబరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్న ట్లు తెలిపారు. నిందితు ల వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 3 ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వి వరించారు. ఇదిలావుండగా గ్రామానికి చెందిన ఏడుగురిని అటవీశాఖ అధికారు లు అక్రమంగా అరెస్టు చేసి దొంగ కేసులో ఇరికించారని గ్రామానికి చెందిన ప లువురు అటవీశాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మూడు రోజులుగా తమవారిని చూపించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించా రు. గ్రామస్థుల నిరసన అనంతరం అటవీశాఖ అధికారులు విలేకరులకు కేసు వివరాలు వెల్లడించి, నిందితులను చూపించారు.

Updated Date - 2022-12-07T22:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising