ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారూ..పట్టించుకోరు!

ABN, First Publish Date - 2022-05-15T05:27:38+05:30

జిల్లా అధికారయంత్రాంగం జనం బాట పట్టారు. కీలకమైన ఉన్నతాధికారులు కార్యాలయాలను దాటి క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. తాజాగా పశ్చిమప్రాంత పల్లెల్లో రాత్రి బస కూడా చేశారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతనెల 4న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌కుమార్‌ పాలనలో, ఉన్నతాధికారుల పనితీరులో మార్పు ద్వారా పాలన ప్రజలకు చేరువ చేసే విషయంపై దృష్టిసారించారు.

తర్లుపాడు మండలం మేకలవారిపల్లెలో జగనన్న లేఅవుట్‌లో ఇళ్లను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జనం చెంతకు యంత్రాంగం

పల్లెబాట పట్టిన ఉన్నతాధికారులు

హాస్టళ్లు, సచివాలయాల్లో నిద్ర

పథకాల పురోగతి పరిశీలన

గ్రామసభల్లో సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజానీకం

ఒంగోలు వెలుపల స్పందనల్లో అర్జీల స్వీకరణ

ఎస్సీ, ఎస్టీ వినతులపై ప్రత్యేక దృష్టి

చొరవచూపుతున్న కలెక్టర్‌, సమస్యలు పరిష్కరిస్తేనే ఫలితం

ఒంగోలు, మే 14 (ఆంధ్రజ్యోతి): 

-ఉపాధి హామీ ద్వారా రైతులు గడ్డిజొన్న పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే పుల్లలచెరువు మండలం ముటుకుల సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్‌ తమ నుంచి అక్రమంగా రూ.2,500 వసూలు చేశారని రైతులు ఫిర్యాదుచేశారు. శుక్రవారం రాత్రి ముటుకుల గ్రామ సచివాలయంలో డీపీసీవో నాగిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ విశ్వనాథ్‌రెడ్డికి వారు సమస్యను వివరించారు. వెటర్నరీ అసిస్టెంట్‌ తాను డబ్బులు తీసుకోలేదని, ఉపాధి సిబ్బందికే ఆ విషయం తెలుసని తెలిపారు.

-త్రిపురాంతకంలో పల్లెనిద్ర అనంతరం ఉదయం డీఆర్వో పి.శ్రీనివాసులు ఉపాధి కూలీలతో మాట్లాడారు. వేతనాలు ఆలస్యంగా తమ ఖాతాలకు వేస్తున్నారని త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరగా సమస్యను కలెక్టరు దృష్టికి తీసుకెళతానని డీఆర్వో తెలిపారు. 

-ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ షేక్‌ మస్తాన్‌అలీ శుక్రవారం రాత్రి  మార్కాపురం మండలంలోని బొందలపాడులో పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని డ్రైనేజీలు, సీసీరోడ్డు పరిశీలించారు. 1200 మీటర్ల మేర డ్రైనేజీ, 350మీటర్ల మేర సీసీరోడ్లు అత్యవసరమని గుర్తించారు. కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. 

- ఇలా జిల్లాలో అధికారుల పల్లె నిద్ర, ఆ తర్వాత గ్రామ పరిశీలనలో వెలుగుచూసిన సమస్యలు.. జిల్లాస్థాయిలో కలెక్టర్‌, జేసీ, ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం మార్కాపురంలో ఎస్సీ, ఎస్టీ స్పందనలో అర్జీల స్వీకరణ అనంతరం తలోవైపు వెళ్లి గ్రామాలను పరిశీలించారు. గ్రామసభల నిర్వహణతోపాటు సచివాలయాలను సందర్శించి రాత్రికి పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయాన్నే గ్రామాల్లో ఉపాధి పనులు, పారిశుధ్యం, మౌలిక వసతులను పరిశీలించగా అంతా సమస్యలమయంగా ఉన్నట్లు గుర్తించారు. మరి ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.


జిల్లా అధికారయంత్రాంగం జనం బాట పట్టారు. కీలకమైన ఉన్నతాధికారులు కార్యాలయాలను దాటి క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. తాజాగా పశ్చిమప్రాంత పల్లెల్లో రాత్రి బస కూడా చేశారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతనెల 4న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌కుమార్‌ పాలనలో, ఉన్నతాధికారుల పనితీరులో మార్పు ద్వారా పాలన ప్రజలకు చేరువ చేసే విషయంపై దృష్టిసారించారు. జిల్లాల పునర్విభజన అనంతరం కూడా అత్యధిక ప్రాంతం జిల్లాకేంద్రానికి సుదూరంగా ఉండటం, ఆ ప్రాంతంలో కీలకమైన రెవెన్యూ, మండల పరిషత్‌ ఇతర శాఖల అధికారులు ప్రజాసమస్యలపై తగుస్థాయిలో స్పందించడం లేదని గుర్తించారు. ఒకవైపు ఆయా పథకాల పురోగతిపై తరచూ నిర్వహించే సమీక్షలు, మరోవైపు ప్రతి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే స్పందనలో వచ్చే వినతుల ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. ఇతర రూపాల్లోనూ ఇలాంటి సమాచారమే అందడంతో పాటు జిల్లా పునర్విభజన అనంతరం జనాభాలో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండగా వారి సమస్యలపై స్పందన ఉండటం లేదన్న ఫిర్యాదులు అందాయి.


ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక స్పందన

ఉన్నతాధికారులు జనంతో మమేకం కావడం ద్వారా వారి సమస్యలు పరిష్కారం, పథకాల పురోగతికి చర్యలు తీసుకొనే వైపు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో ఒకవైపు జిల్లా కేంద్రం వెలుపల ప్రాంతాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరణకు శ్రీకారం చుట్టడంతో పాటు ఎస్సీ, ఎస్టీల వినతులపై ప్రత్యేక దృష్టిసారించారు. అందుకోసం సాధారణంగా ప్రతి సోమవారం ఒంగోలులో నిర్వహించే స్పందనకు పరిమితం కాకుండా గత నెలలో ఒంగోలులోనే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక స్పందన నిర్వహించి జిల్లావ్యాప్తంగా ఆ వర్గాలకు చెందిన వారి నుంచి స్వీకరించారు. కాగా అర్జీదారుల చెంతకే యంత్రాంగం వెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా ఈనెల 9న సోమవారం ఒంగోలులో కాకుండా దర్శిలో జిల్లా స్థాయి స్పందన నిర్వహించారు. అలాగే 13వతేదీ మరోసారి ఎస్సీ, ఎస్టీల వినతుల స్వీకరణ కోసం పశ్చిమ ప్రాంతంలో ప్రధాన పట్టణమైన మార్కాపురంలో ప్రత్యేక విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రెండింటికి కలెక్టర్‌ స్వయంగా హాజరు కాగా ముఖ్యమైన అధికారులంతా వెళ్లారు.


తలో దిక్కున పల్లె నిద్ర

ఇదిలా ఉండగా సమస్యలు అధికంగా ఉన్న పశ్చిమ ప్రాంతం పల్లెల్లో కీలకమైన ఉన్నతాధికారులు రాత్రిళ్లు బస చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలు, పథకాల పురోగతి పరిశీలన లక్ష్యంగా పల్లెనిద్ర చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మార్కాపురంలో కలెక్టర్‌తోపాటు 30మందికిపైగా ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఎస్సీ, ఎస్టీల విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనగా అనంతరం తలోదిక్కుకు వెళ్లారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కంభం మండలంలో పర్యటించి కంభం చెరువు సందర్శనతోపాటు కంభం, కందులాపురం, జంగంగుంట్లతో ప్రభుత్వ వైద్యశాల,  సచివాలయం, చెత్తసంపద కేంద్రాల్లో తనిఖీలతోపాటు కందులాపురం సచివాలయంలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం కంభం ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే రాత్రికి నిద్రించారు. జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ బీపేట మండలం మోక్షగుండం సందర్శించి జగనన్న కాలనీ, సచివాయాలను పరిశీలించడంతోపాటు గ్రామస్థులతో రచ్చబండ నిర్వహించి రాత్రికి అక్కడే బస చేశారు. 


ఉన్నతాధికారులు అదేబాటలో..

జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, సహకార అధికారి రాజశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, కాలుష్య నియంత్రణ అధికారి నాగిరెడ్డిలు పుల్లలచెరువు మండలంలో ఐటీవరం, ముటుకుల, పుల్లలచెరువు, డీపీవో నారాయణరెడ్డి వైపాలెంలోనూ, జడ్పీ సీఈవో జాలిరెడ్డి దోర్నాలలోనూ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, ఆర్‌అడ్‌బీ ఎస్‌ఈ విజయరత్నం గిద్దలూరు మండలం కేఎస్‌పల్లిలో, డీఆర్వో పులి శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ బాబురావు, మత్య్సశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డిలు త్రిపురాంతకం మండలంలోనూ, వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌డీసీ దేవేంద్రనాఽథ్‌రెడ్డి తర్లుపాడులోనూ పల్లెనిద్ర చేశారు.


సమస్యల వెల్లువ

ఇలా పలు గ్రామాలు, మండల కేంద్రాల్లో  ఉన్నతాధికారులు రాత్రి బసతోపాటు గ్రామాల్లో పలు సమస్యలు, పథకాల పురోగతి పరిశీలనతో పాటు క్షేత్రస్థాయిలోని ప్రభుత్వకార్యాలయాల పనితీరును పరిశీలించారు. రాత్రిపూట ఇంచుమించు అందరూ స్థానిక ప్రజలతో గ్రామసభలు, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించగా అనేకమంది తమ నివాస ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక పడుతున్న అవస్థలను ఏకరువు పెట్టారు. అలాగే కార్యాలయాల ద్వారా సకాలంలో పౌరసేవలు, పథకాల లబ్ధి అందకపోవడం పలు ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు ఇతర గ్రామ ఉమ్మడి సమస్యలతో పాటు కార్యాలయాల్లో సేవలు అందకపోగా వంటి అంశాలను అధికారులు గుర్తించారు. 


సత్వర పరిష్కారం లభించేనా?

మార్కాపురంలో ఒక్కపూట కొద్దిగంటలు నిర్వహించిన అర్జీల స్వీకరణకు ఏకంగా 334 వినతులు అందడం ఆ ప్రాంతంలో ప్రజల అవస్థలను పట్టిచూపుతోంది. ఇలాంటి పరిస్థితే జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో వాస్తవ విషయాన్ని గుర్తించి క్షేత్రస్థాయి వైపు ఉన్నతాధికారులు దృష్టిసారించేలా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చొరవ చూపడం ఆభినందనీయం. అయితే ఈ కార్యక్రమం రాత్రి బసలకు, వినతుల స్వీకరణకు పరిమితం కాకుండా తమకు అందిన అర్జీలలో న్యాయబద్ధమైన వాటికి సత్వర పరిష్కారం చూపడంతోపాటు గ్రామాల్లో కనీసం ప్రజల ఉమ్మడి సమస్యలుగా ప్రస్తావించిన వాటిపై పరిష్కారం చూపగలిగేతేనే ఫలితం ఉంటుంది. కాగా శనివారం ఉదయం ఆ ప్రాంతంలో ఉన్నతాధికారులు ఉపాధి పనులు, జగనన్న కాలనీలను పరిశీలించారు. 



Updated Date - 2022-05-15T05:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising