ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సానికవరం వైసీపీలో వర్గపోరు బహిర్గతం

ABN, First Publish Date - 2022-05-27T07:14:36+05:30

మంత్రి సురేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్ర గొండపాలెం నియోజకవర్గంలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఇటీవల పుల్లలచెరువు మండలంలో వైసీపీలోని అసమ్మతి నాయకులు ఏకంగా శిబిరం ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించారు.

సమావేశమైన సర్పంచ్‌, ఎంపీటీసీ వర్గీయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దారవీడు(మార్కాపురం), మే 26: మంత్రి సురేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్ర గొండపాలెం నియోజకవర్గంలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఇటీవల పుల్లలచెరువు మండలంలో వైసీపీలోని అసమ్మతి నాయకులు ఏకంగా శిబిరం ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించారు. పెద్దారవీడు మండలం సానికవరంలో సర్పంచ్‌, ఎంపీటీసీ వర్గీయులు గురువారం సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌ ఎన్ని కలలో ఓడిపోయిన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, మంత్రి సురేష్‌ ద్వంద వైఖరే ఇందుకు కారణమని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి నియంతృత్వ వైఖరి పార్టీని దెబ్బ తీస్తోందని ఆరోపణలు చేశారు. పాలిరెడ్డి కృష్ణారెడ్డి అధికారులకు ఫోన్‌ చేసి సానికవరం సర్పంచ్‌ మూలా వెంకట రమణారెడ్డి, ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షురాలు-2 పోటు కుమారి, గ్రామ వైసీపీ నాయకుడు ఒద్దుల కృష్ణారెడ్డిలు ఎవరు వచ్చినా పనిచేయొద్దని చెబుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ, అధికారిక కార్యక్రమాలు సర్పంచ్‌గా, ఎంపీ టీసీలుగా గెలుపొందినవారికి సమాచారం ఇవ్వకుండా, ఓడిపోయిన  వర్గీయులకు సమాచారం ఇస్తున్నారన్నారు. గ్రామంలో తమ వర్గానికి చెందిన వారికి 800 ఓట్లు ఉన్నాయని, వారందిరితో రెండు రోజుల్లో సమాలోచనలు చేసి తుది నిర్ణయం తీసుకొని, భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పరిస్థితి కారణం కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి వైఖరే అని ఆరోపించారు.


Updated Date - 2022-05-27T07:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising