15 నుంచి సాగర్ నీరు విడుదల
ABN, First Publish Date - 2022-08-05T05:03:34+05:30
సాగర్ నీరు ఈనెల 15వతేదీ నుంచి సాగునీటి కోసం విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది 15 రోజుల ముందుగానే ఈ నీటిని విడుదల చేస్తున్నారన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని 2.54లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూన్, జూలై నెలల్లో తాగునీటి కోసం 4 టీఎంసీల నీటిని ప్రభుత్వం విడుదల చేయగా 103 తాగునీటి చెరువులను 70శాతం వరకు నింపారన్నారు. ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే క్రమంలో అవసరాన్ని బట్టి వారబందీ విధానంలో మేజర్లకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.
రైతులు వ్యవసాయశాఖ సూచించిన పంటలు సాగు చేసుకోవాలి
కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 4: సాగర్ నీరు ఈనెల 15వతేదీ నుంచి సాగునీటి కోసం విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది 15 రోజుల ముందుగానే ఈ నీటిని విడుదల చేస్తున్నారన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని 2.54లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూన్, జూలై నెలల్లో తాగునీటి కోసం 4 టీఎంసీల నీటిని ప్రభుత్వం విడుదల చేయగా 103 తాగునీటి చెరువులను 70శాతం వరకు నింపారన్నారు. ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే క్రమంలో అవసరాన్ని బట్టి వారబందీ విధానంలో మేజర్లకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. కేటాయించిన నీటిని క్రమపద్ధతిలో వాడే విధంగా ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల పర్యవేక్షణ ఉంటుందన్నారు. మేజర్ లీకేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తామన్నారు. ఇటీవల చెరువుల్లో నింపిన నీటిని కేవలం తాగునీటి కోసమే వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే కంభం చెరువు నుంచి సాగునీటిని విడుదల చేయగా, మోపాడు నుంచి సెప్టెంబరు 1 నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీటిని విడుదల చేస్తున్నందున సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 23వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టు పరిధిలో ఏ రకం వరి వంగడాలు వేయాలో వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఆర్‌బీకేల్లో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన తర్వాత ఈక్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఈక్రాప్ నమోదులో అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చే స్తామని హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ ఆళ్ళ రవీంద్రారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ లక్ష్మారెడ్డి, డీఏవో శ్రీనివాసరావు ఉన్నారు.
Updated Date - 2022-08-05T05:03:34+05:30 IST