ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు జాగిలం రూబి మృతి

ABN, First Publish Date - 2022-05-19T07:14:06+05:30

పోలీసు శాఖలో తొమ్మిదేళ్లపాటు విశేషంగా సేవలందించిన జాగిలం రూబి వయోభారంతో మంగళవారం మృతిచెందింది.

రూబి కళేబరం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాంఛనాలతో అంత్యక్రియలు

ఒంగోలు (క్రైం), మే 18: పోలీసు శాఖలో తొమ్మిదేళ్లపాటు విశేషంగా సేవలందించిన జాగిలం రూబి వయోభారంతో మంగళవారం మృతిచెందింది. పోలీసు భద్రతా విభాగంలో ట్రాకర్‌గా సేవలందించిన రూబి వయస్సు 13 ఏళ్లు. దొంగతనం కేసులను ఛేదించడంలో దిట్ట. లాబ్రడార్‌ జాతికి చెందిన జాగిలం 2011 ఏప్రిల్‌ 1న పోలీసు శాఖలో అడుగుపెట్టింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ హ్యాండ్లర్‌గా పనిచేశారు. జాగిలం 32 కేసుల్లో కీలకమైన ఆధారాలను పట్టింది. రూబి అంత్యక్రియలు పోలీస్‌ లాంఛనాలతో బుధవారం జరిగాయి. తొలుత రూబి కళేబరాన్ని అమరవీరుల స్థూపం వద్ద ఉంచారు. ఎస్పీ మలికగర్గ్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు శిక్షణ కేంద్రం వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియల్లో ఏఎస్పీ కె.నాగేశ్వరరావు, ఏఆర్‌ ఏఎస్పీ ఆశోక్‌బాబు, ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఏఆర్‌ డీఎస్పీ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T07:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising