సొంత డబ్బుతో రోడ్డుకు మరమ్మతులు
ABN, First Publish Date - 2022-12-16T22:54:43+05:30
సీఎ్‌సపురం మండలంలోని కృషంనాయునిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో రోడ్డును పాలకులు బాగుచేయకపోవడాన్ని నిరసిస్తూ అందరూ కలిసి సొంత నిధులతో గురువారం రోడ్డును బాగుచేసుకున్నారు. సీఎ్‌సపురం నుంచి ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనకు వెళ్లే మార్గ మధ్యంలోని కృష్ణంనాయునిపల్లి వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పాడ్డాయి. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారైంది.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కదిలిన గ్రామస్థులు
మట్టి తోలి చదును చేసిన వైనం
సీఎ్‌సపురం, డిసెంబరు 16 : మండలంలోని కృషంనాయునిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో రోడ్డును పాలకులు బాగుచేయకపోవడాన్ని నిరసిస్తూ అందరూ కలిసి సొంత నిధులతో గురువారం రోడ్డును బాగుచేసుకున్నారు. సీఎ్‌సపురం నుంచి ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనకు వెళ్లే మార్గ మధ్యంలోని కృష్ణంనాయునిపల్లి వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పాడ్డాయి. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారైంది. దీంతో వాహదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం భైరవకోనకు పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతుంటారు. అలాగే సీఎ్‌సపురం నుంచి నెల్లూరు జిల్లా సీతారామపురం మీదుగా బెంగళూరుకు కూడా ఈ రోడ్డు మీదనే ప్రయాణించాలి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా రోడ్డును బాగుచేయకపోవడంతో కృష్ణంనాయునిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో పాడైన రోడ్డు వరకు తమ సొంత నిధులు వెచ్చించి మట్టిని తోలి ఎక్స్‌కవేటర్ సహాయంతో చదును చేయించి రోలింగ్ చేయించారు. గతంలో సీఎ్‌సపురం డీజీపేట రహదారిలో అక్కడక్కడా పడిన గుంతలను ఆటో, జీపు డ్రైవర్లు సొంత డబ్బుతో గుంతలు పూడ్చారు. ప్రస్తుతం వర్షాలకు మట్టి లేచిపోయి మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి సీఎ్‌సపురం నుంచి భైరవకోన వరకు రోడ్డును బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-12-16T22:54:44+05:30 IST