ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ అధికారులు వర్సెస్‌ అధికార పార్టీ

ABN, First Publish Date - 2022-10-17T05:35:17+05:30

జగనన్న లేఅవుట్‌ కాలనీల్లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో 700 మంది అనర్హులంటూ తహసీల్దార్‌ ప్రకటించడం వైసీపీనేతల్లో కాకరేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనర్హులంటూ తహసీల్దార్‌ ప్రకటన

నేడు ప్రజాదర్భార్‌కు వైసీపీ నేత పిలుపు

టంగుటూరు, అక్టోబరు 16 : జగనన్న లేఅవుట్‌ కాలనీల్లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో 700 మంది అనర్హులంటూ తహసీల్దార్‌ ప్రకటించడం వైసీపీనేతల్లో కాకరేపుతోంది. ఈవిషయమై నిజం నిగ్గు తేల్చేందుకు ఈనెల 17న తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు తరలిరావాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు ప్రజాదర్భార్‌ పేరిట పిలుపునిచ్చారు. రెవెన్యూ అధికారులకు, అధికారపార్టీ ప్రధాన నేతలకు మధ్యన నెలకొన్న ఈ విచిత్ర పరిస్థితితో ప్రజలు గందరగోళపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టంగుటూరులోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో జగనన్న లేఅవుట్‌ కాలనీలు ఏర్పాటు చేశారు. నాలుంగింటిలో కలిపి మొత్తం 1,234 ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. నాలుగు లేఅవుట్లలో మూడు చోట్ల భూములు కొనుగోలు చేశారు. నాలుగు ప్రాంతాల్లో భూమిని చదునుచేసి ఇళ్ల స్థలాల నిర్మాణాలకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చించారు. ఈ కాలనీల్లో స్వల్పంగానే ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అవి నత్తనడకన నడుస్తున్నాయి


700 మంది అనర్హులని తహసీల్దార్‌ ప్రకటన

 టంగుటూరులోని జగనన్న లేఅవుట్‌ కాలనీల్లో పంచిన ఇళ్ల స్థలాల్లో 700 మంది లబ్ధిదారులు అనర్హులేనని తహసీల్దార్‌ ప్రకటించారు. రెవెన్యూ అధికారులు జరిపిన సర్వే ఆధారంగా గుర్తించిన అనర్హుల జాబితాను వారివారి గ్రామ సచివాలయాల్లో గత నెల 29న ప్రకటించారు. ఈపరిస్థితిని అధికార పార్టీ పెద్దలు జీర్ణించుకోలేక పోయారు. ఈవిషయమై తహసీల్దార్‌కు, అధికారపార్టీ అధినాయకులకు మఽధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇళ్ల స్థలాల పంపిణీలో కొంత గందరగోళం జరిగిందని, ఇందుకు ఎంబీసీ డైరెక్టర్‌ పుట్టా వెంకట్రావు ప్రధాన కారణమని తహసీల్దార్‌  చిరంజీవి ఆరోపించగా, తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వెనుకపడ్డ వర్గాలకు చెందినవాడిని కనుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని పుట్టా ఆ ఆరోపణలు కొట్టిపారేశారు. తాము అనర్హులుగా ప్రకటించిన వారిలో అర్హులుంటే వారి అర్హతలను తెలిపే వివరాలతో కూడిన అర్జీలను తహసీల్దార్‌ కార్యాలయంలో ఈనెల 31లోగా ఇవ్వాలని తహసీల్దార్‌ ప్రకటించారు. ఈమేరకు అనర్హుల జాబితాల్లోని కొందరు తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతున్నది.


నేడు ప్రజాదర్భారుకు అశోక్‌బాబు పిలుపు

 ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకపోయేందుకని చెబుతూ అశోక్‌బాబు ఏకంగా ప్రజాదర్భార్‌కు పిలుపునిచ్చారు. రెవెన్యూ సమస్యలున్నవారు నేరుగా సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే ప్రజాదర్భార్‌కు హాజరై అర్జీలు ఇవ్వాలని అధికారపార్టీ ప్రకటించింది. మండలంలోని అన్ని గ్రామాల్లో తాము అనర్హులమని గుర్తించిన వారు అర్హతలుంటే అర్జీరూపంలో సమర్పించాలని తహసీల్దార్‌ ప్రకటించినా, రెవెన్యూ పరంగా సమస్యలున్నవారంతా ప్రజాదర్భార్‌కు తరలిరావాలని అశోక్‌బాబు పిలుపునిచ్చినా ఇద్దరి ఏకైౖక అజెండా టంగుటూరులో తహసీల్దార్‌ అనర్హులుగా ప్రకటించిన ఇళ్ల స్థలాల లబ్దిదారులే. సమస్యలు తెలిపేందుకు ప్రజాదర్భార్‌కు రావాలని ఆదివారం మైకు ద్వారా టంగుటూరులో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు సమస్య తహసీల్దార్‌ వర్సెస్‌ అశోక్‌బాబుగా మారింది. ప్రజాదర్భార్‌లో గ్రామ వలంటీర్లు పాల్గొంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా జరిగే ఈదర్భార్‌లో వలంటీర్లు  ఏమేరకు పాల్గొంటారన్నది వేచిచూడాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, లేక ప్రయివేట్‌ కార్యక్రమమా అని కూడా రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు. ప్రజాదర్భార్‌ విజయవంతానికి అశోక్‌బాబు అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాల నడుమ జరుగుతున్న ఈపోరులో అర్హత ఉండీకూడా ఇప్పటికీ పనులు జరగనివారికి న్యాయం జరుగుతుందా,  అంతా అధికారపార్టీలో భాగస్వాములే కదా అని సర్దుకుపోతారా! సోమవారం అసలేమి జరుగబోతుందోదని జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2022-10-17T05:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising