ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ అధికారులు తీరు మార్చుకోవాలి

ABN, First Publish Date - 2022-03-06T05:10:39+05:30

రెవెన్యూ, రైతుల సమస్యలను పక్కనపెట్టి రియల్టర్ల పనులు చేయడానికి రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపు తున్నారని, ఇది సరికాదని, తీరు మార్చుకోవాలని ఎంపీపీ మురళీకృష్ణ అన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీపీ మురళీకృష్ణ 

కొనకనమిట్ల, మార్చి 5 : రెవెన్యూ, రైతుల సమస్యలను పక్కనపెట్టి రియల్టర్ల పనులు చేయడానికి రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపు తున్నారని, ఇది సరికాదని, తీరు మార్చుకోవాలని ఎంపీపీ మురళీకృష్ణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య స మావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో  పోరంబోకు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా  రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని గ్రామాలలో రెవె న్యూ సమస్యల కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయని ఎంపీపీ ఆం దోళన వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశానికి రెవెన్యూ అధి కారులు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు పై కలక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్‌ సమస్యలతో ప్రజ లు సతమతం అవుతున్నారని  మండలానికి ఇన్‌చార్జి ఏఈ ఉన్నప్ప టికీ మూడు నెలల నుంచి ఆయన జాడే లేదని జిల్లా విద్యుత్‌ శాఖ ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్ప టికప్పుడు అధికారులు పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ ప్రజ లను తిప్పుకోవద్దని పేర్కొన్నారు. మండలంలో విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యం వీడాలని పాఠశాలల మెరుగు పడేందుకు కృషి చేయాలని చెప్పారు. చాల వరకు పాఠశాలలో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదని ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని తెలిపారు. అంగన్‌వాడీల్లో పి ల్లల సంఖ్య ఎక్కువగా నమోదవుతుందని, కానీ రిజిస్టర్‌లో ఉన్న సంఖ్య మేరకు కేంద్రాల్లో లేరన్నారు. బాలింతలు, గర్భిణుల సంఖ్య కూడా రికా ర్డుల ప్రకారం వ్యత్యాసం ఉందని మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని  హెచ్చరించారు. స్పందించిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ తాను రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చానని అప్పటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నానని, పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటానని చె ప్పారు.  మండల ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటరెడ్డి మాట్లాడుతూ బచ్చల కురపాడు గ్రామానికి వచ్చే సాగర్‌ నీరు రావడం లేదని గ్రామానికి తాగు నీరు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ కాలనీల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని తెలిపారు.  కార్యక్రమంలో జడ్పీ టీసీ సభ్యుడు అక్కిదాసరి ఏడుకొండలు,  ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్‌, ఈవో ఆర్డీ జనార్దన్‌, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్య దర్శులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T05:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising