ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్జిన్లను ఆక్రమించి అద్దె వసూలు

ABN, First Publish Date - 2022-12-21T22:28:31+05:30

రోడ్డు మార్జిన్లను ఆక్రమించడం, అందులో ఒక చిన్నపాటి బం కునో, రేకులషెడ్‌నో నిర్మించడం, కొన్నాళ్ల పాటు చిన్న వ్యాపారం నిర్వహించి తరువాత ఆ స్థలా న్ని అద్దెకు ఇవ్వడం, నెలనెలా అద్దెతో జేబులు నింపుకోవడం గిద్దలూరులో పరిపాటిగా మా రింది.

రోడ్డు వెంట ఉన్న దుకాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరువ్యాపారుల ఇక్కట్లు

పట్టించుకోని అధికారులు

గిద్దలూరు, డిసెంబరు 21 : రోడ్డు మార్జిన్లను ఆక్రమించడం, అందులో ఒక చిన్నపాటి బం కునో, రేకులషెడ్‌నో నిర్మించడం, కొన్నాళ్ల పాటు చిన్న వ్యాపారం నిర్వహించి తరువాత ఆ స్థలా న్ని అద్దెకు ఇవ్వడం, నెలనెలా అద్దెతో జేబులు నింపుకోవడం గిద్దలూరులో పరిపాటిగా మా రింది. ముఖ్యంగా గిద్దలూర పట్టణం గుండా వెళ్లే జాతీ య రహదారికి ఇరువైపులా జిల్లా పరిషత్‌ బాలుర ఉన్న త పాఠశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా వందలాది మంది చిరువ్యాపారులు నిత్యం వ్యాపారం చేసుకుంటూ కాలం వె ల్లదీస్తున్నారు. అయితే వీరిలో సగం మందికి పైగా ప్రతినెలా అద్దెలు చెల్లించేవారే. రోడ్డు మార్జిన్లలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చిన్నపాటి బంకును వేసుకోవడం, తరువాత అద్దెకు ఇవ్వడం చేస్తున్నారు. నెలకు స్థలం సైజును బట్టి రూ.1500 నుంచి రూ.6వేల వరకు అద్దెలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఫిర్యాదులు వెళ్లినప్పటికీ అద్దె విష యం అధికారులకు చెబితే ఖాళీ చేయిస్తామని యజమానులు బెదిరిస్తుండడంతో చిరువ్యాపారులు చేసేదిలేక నెలనెలా అనధికారికంగా అద్దెలు చెల్లిస్తున్నారు. అధికారులు వచ్చి ఎంత ప్రశ్నించినా మేం ఎవరికీ అద్దె ఇవ్వడం లేదన్న సమాధానం చెప్పక తప్ప ని పరిస్థితి నెలకొంటున్నది. ఇలా అక్రమ ఆక్రమణలు, అద్దె వసూళ్లపై చిరువ్యాపారుల నుంచి వ్యతిరేకత గతంలో రాగా ప్రస్తుతం ఎవరూ వ్యాపారం చేస్తున్నారో వారి పేర్లను మున్సిపల్‌ అధికారులు నమోదు చేసుకుని ఒక్కొక్కరికీ 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో స్థలం కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే ఇది కార్యరూపం మాత్రం దాల్చలేదు. దాంతో ఒక్కొక్కరూ అవకాశం ఉన్నంత దూరం రోడ్డు మార్జిన్లను ఆక్రమించి డ్రైనేజీ కాలువలపైనే వ్యాపారం చేస్తుండడంతో డ్రైనేజీలు పూడిపోయి మురుగు నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి కూడా నెలకొంటున్నది. అక్రమణలను ఫుల్‌స్టాప్‌ పెట్టి నిజంగా వ్యాపారం చేసుకునే వారికి అద్దె బాధల నుంచి విముక్తి కల్పించాలని సర్వత్రా వినవస్తున్నది.

Updated Date - 2022-12-21T22:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising