ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డింగ్‌ డ్యాన్స్‌.. రివర్స్‌

ABN, First Publish Date - 2022-04-03T07:28:06+05:30

మండలంలోని గుండంచెర్లలో శుక్రవారం జరిగిన వేనూతల కాటంరాజు తిరునాళ్లలో రికార్డింగ్‌ డ్యాన్స్‌ రివర్స్‌ అయ్యింది.

విద్యుత్‌ ప్రభపై చిందులేస్తున్న యువతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ విద్యుత్‌ ప్రభ వద్ద గందరగోళం

బందోబస్తు ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం

ప్రత్యేక బలగాల ప్రవేశంతో  పరిస్థితి అదుపులోకి 

పెద్దారవీడు (మార్కాపురం), ఏప్రిల్‌ 2 : మండలంలోని గుండంచెర్లలో శుక్రవారం జరిగిన వేనూతల కాటంరాజు తిరునాళ్లలో రికార్డింగ్‌ డ్యాన్స్‌ రివర్స్‌ అయ్యింది. బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన విద్యుత్‌ ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. అవి రాత్రి 11గంటలకు ప్రారంభమయ్యాయి. కళాకారులు పాటలతో పాటు అసభ్య నృత్యాలతో చిందులు వేశారు. ప్రేక్షకులు ఆ నృత్యాలను వీడియోలు తీస్తుండటంతో పోలీసుల అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆర్కెస్ట్రా నిర్వాహకుడు ప్రేక్షకులను హెచ్చరిస్తూ ఇలాగైతే కేవలం సంగీత విభావరి మాత్రమే ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రేక్షకులు బారికేడ్లను దాటి అక్కడ విధి నిర్వహణలో ఉన్న సీఐ, ముగ్గురు ఎస్‌ఐలతో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీస్‌ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కిశోర్‌కుమార్‌ ప్రత్యేక బలగాలను అక్కడకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన విద్యుత్‌ ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేశారు. 

Updated Date - 2022-04-03T07:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising