ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్రపుడెక్కతో నిండిన ఆర్‌బీ చానల్‌

ABN, First Publish Date - 2022-09-28T05:27:44+05:30

మండలంలోని రాజు బంగారుపాలెం కాలువ(ఆర్‌బీ చానల్‌) గుర్రుపు డెక్క, తూటు కాడతో నిండిపోయింది.

గుర్రపుడెక్క, తూటుకాడతో నిండిన రాజుబంగారుపాలెం కాలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని అధికారులు

 ఏటా రైతులకు తప్పని ఇబ్బందులు 

ప్రస్తుతం నీటి విడుదలకు ఎదురుచూపులు

చినగంజాం, సెప్టెంబరు 27: మండలంలోని రాజు బంగారుపాలెం కాలువ(ఆర్‌బీ చానల్‌) గుర్రుపు డెక్క, తూటు కాడతో నిండిపోయింది. దీంతో సక్రమంగా నీరు ప్రవహించడంలేదు. ఏటా రైతులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిలో వీటిని తొలగించి కాలువను మరమ్మ తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పనులు జరగడం లేదు. ప్రస్తుత సీజన్‌లో ఇంకా నీరు విడుదల చేయక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఆర్‌బీ చానల్‌ పరిధిలో 200 ఎకరాలకుపైగా ఆయ కట్టు ఉంది. ఇందులో వరి సాగుచేస్తూ ఉంటారు. అనుకూల వాతావరణం ఉండటంతో వరి నారుమడు లు పోసేందుకు రైతులు భూమిని సిద్ధం చేశారు. చానల్‌కు నీరు విడుదల చేయకపోవడంతో నారు  పో యాలో, వద్దో తెలియని సందిగ్ధంలో రైతులు ఉన్నారు.  వర్షాలు బాగా పడి కాలువలలో నీరు అధికమై సము ద్రపు పాలు చేస్తున్నారే తప్ప రైతులకు ఉపయోగపడే లా పంట కాలువలోనికి నీరు వదలక పోవడం ఏమి టని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కనీసం నాట్లు వేసే వరకైనా నీరు వదిలారని, ఈ ఏడాది కాలువకు నీరు వదల్లేదని రైతులు పేర్కొన్నారు.

కొమ్మమూరు కాలువ సంతరావూరు లాకుల వద్ద నుంచి పందిళ్లపల్లి మీదుగా రాజుబంగారుపాలెం కా లువకు నీరు విడుదల అవుతుంది. పందిళ్లపల్లి, కడవ కుదురు, చినగంజాం ప్రాంత రైతులు ఈ కాలువపై ఆధారపడి పంటలు పండిస్తూ ఉంటారు.  నీటి ప్రవా హానికి అడ్డుగా పెరిగిన గుర్రపుడెక్క, తూటుకాడ, చిల్ల చెట్లను తొలగించాలని రైతులు కోరుతు న్నారు. అక్టోబరు నెల వస్తున్నపుపటికి నీరు విడుదల చేయక పోవడంతో ఏమి చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. వర్షాలు కురిసి నదులలో నీరు అధికమై సముద్రానికి వదలి వేస్తున్నారు. వృథా గా పోయే నీటిని కాలువలకు వదిలితే రైతులు పంటలు పండించుకునేందుకు ఉపయోగపడ తాయి. అధికారులు పరిశీలించి ఆర్‌బీ చానల్‌కు నీటిని విడుదల చేయాలని రైతులు నవబోతు చలమయ్య, కాల్వ మస్తాన్‌రావు, నక్కల రవి, వడ్లమూడి బాబు, నక్కల శ్రీనివాసరావు, మర్రి సుబ్బారావు, కె.వేణుగోపా లరావు, శ్రీనివాసరావు, వడ్లమూడి తిరుపతిరావు తది తరులు కోరుతున్నారు. దీనిపై చీరాల ఇరిగేషన్‌ శాఖ ఏఈఈ పవన్‌కుమార్‌ను వివరణ కోరగా ఆర్‌బీ చాన ల్‌కు ప్రస్తుతం పందిళ్లపల్లి వరుకు మాత్రమే నీరు వస్తోంది.  అక్కడ నుంచి నీరు విడుదల చేయడానికి కాలువ మరమ్మతులకు అంచనాలు వేసి ఉన్నాతాధి కారులకు పంపినట్లు తెలిపారు. 

Updated Date - 2022-09-28T05:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising