ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్వారీయింగ్ చేపట్టాలి
ABN, First Publish Date - 2022-12-07T23:50:42+05:30
ప్రజలకు ఇబ్బందు లు కలగకుండా గ్రానైట్ క్వారీయింగ్ చేపట్టి ప లువురికి ఉపాధి కల్పించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు.
జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
బల్లికురవ, డిసెంబరు 7: ప్రజలకు ఇబ్బందు లు కలగకుండా గ్రానైట్ క్వారీయింగ్ చేపట్టి ప లువురికి ఉపాధి కల్పించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండలం లోని వీర్లకొండ వద్ద సర్వే నెంబరు 103లో మె స్సర్స్ లక్ష్మీ గ్రానైట్ క్వారీ యజమాని శిద్దా రాఘ వరావు 0. 186 హెక్టార్ల భూమిలో గ్రానైట్ క్వారీ నిర్వహ ణకు ప్రభుత్వం నుంచి లీజు పొందారు. ఈ క్వారీ నిర్వహిస్తే ప్రజలకు పర్యావరణ కాలుష్యంతో ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధ్యక్ష తన నిర్వహించారు. చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఉ న్న మల్లాయపాలెం, కొణిదెన, చెన్నుపల్లి, వేమవరం గ్రామాలకు చెం దిన పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు క్వారీ ఏర్పాటుకు తమకు ఎ లాంటి అభ్యంతరం లేదని చెప్పారు. క్వారీలు వ స్తే గ్రామాలలో యువతకు ఉపాధి మెరుగవు తుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
అనంతరం జేసీ మాట్లాడుతూ గ్రానైట్ క్వారీల తో ప్రజలకు శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం, దుమ్ము వంటి ఇబ్బందులు రాకుండా పలు చర్య లు చేపట్టాలన్నారు. ప్రతిరోజు క్వారీలు ఉన్న రోడ్ల లో నీటిని చల్లించాలని సూచించారు. భద్రతాప రంగా కూడా చర్యలు చేపట్టాలన్నారు. క్వారీల యజమానులు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా గ్రామాలలో చేప ట్టాలన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా క్వారీల ఏర్పాటుతో కార్మి కులకు ఉపాధి పెంచేలా యజమానులు చర్యలు చేపట్టలన్నారు. ప్రజ లకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్ర మంలో పర్యావరణ పరిరక్షణ జిల్లా ఈఈ నాగిరెడ్డి, తహీల్దార్ సీతార త్నం, క్వారీ ఇన్‌చార్జి ఉప్పుటూరి కృష్ణ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:50:50+05:30 IST