ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు నాణ్యమైన విద్యుత్‌

ABN, First Publish Date - 2022-10-18T04:09:45+05:30

వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు నా ణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని దర్శి ట్రాన్స్‌కో డీఈ కొప్పెర్ల పిచ్చయ్య అ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాన్స్‌కో డీఈ పిచ్చయ్య

ముండ్లమూరు, అక్టోబరు 17 : వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు నా ణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని దర్శి ట్రాన్స్‌కో డీఈ కొప్పెర్ల పిచ్చయ్య అ న్నారు. సోమవారం స్థానిక సబ్‌ స్టేషన్‌లో సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీబీటీ మీటర్లను ప్రతి రైతు ఆధార్‌కు బ్యాంక్‌ పాసు పుస్తకం అనుసందానం చేసుకున్నట్లయితే ప్రభుత్వం కల్పించే రాయితీ వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ఇప్పటికీ మండలంలో 1065 మంది రైతులు అ నుసంధానం చేయించు కోవాల్సి ఉందన్నారు. సిబ్బంది డీబీటీ పై ప్రత్యేక శ్రద్ధ వ హించాలన్నారు. విద్యుత్‌ వినియోగ దారులు పెండింగ్‌ బకాయిలను త్వరిత గతిన చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఉంటుంద న్నారు. ఆ పైన ఎంత కాల్చుకున్నా నగదు చెల్లించాలన్నారు. దాదాపు మండలంలో 39 లక్షల విద్యుత్‌ బకాయిలు పేరుకు పోయాయన్నారు. తమ సిబ్బంది స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా వసూలు చేయాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున విద్యుత్‌ లైన్‌లు పలు చోట్ల కిందిగా వేలాడి ఉంటాయని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. ఒకే ఇంటికి ఒకే మీటరు ఉండాలన్నారు. రెండు ఉన్నట్లయితే వెంటనే తొలగించే వి ధంగా చూడాలని కోరారు. సమావేశంలో ఏఈ భూరాజు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ సాంబయ్య, లైన్‌మెన్‌లు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, నాయక్‌, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2022-10-18T04:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising