ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయుడుపాలెంలో కొండచిలువ పట్టివేత

ABN, First Publish Date - 2022-10-13T04:19:30+05:30

మండలంలోని నాయుడుపాలెం పొలాల్లో సంచరిస్తున్న 7 అడుగుల కొండ చిలువను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. బుధవారం మండలంలోని నాయుడుపాలెంలో ఆవుల శేఖర్‌రెడ్డి అనే రైతు తన పొలంలోని కందిలో కొండ చిలువ కదలికలను గుర్తించి వెంటనే ఎర్రగొండపాలెం ఫారెస్టు స్నేక్‌ రెస్కువర్‌ మల్లిఖార్జునకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఐటీవరంలో కొండ చిలువను పట్టుకున్న పారెస్టు స్నేక్‌ రెస్కువర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20 రోజుల్లో 4 పట్టుకున్న అధికారులు

పుల్లలచెరువు, అక్టోబరు 12: మండలంలోని నాయుడుపాలెం పొలాల్లో సంచరిస్తున్న 7 అడుగుల కొండ చిలువను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. బుధవారం మండలంలోని నాయుడుపాలెంలో ఆవుల శేఖర్‌రెడ్డి అనే రైతు తన పొలంలోని కందిలో కొండ చిలువ కదలికలను గుర్తించి వెంటనే ఎర్రగొండపాలెం ఫారెస్టు స్నేక్‌ రెస్కువర్‌ మల్లిఖార్జునకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పొలాల్లోకివెళ్లి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. గత నెలలో నాయుడుపాలెంలో 13 అడుగుల కొండ చిలువను పట్టుకోగా ఈ నెల 3 వ తేదీన 11 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు.గత నెల 30 న త్రిపురాంతకం మండలం మేడపి వద్ద 10 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు.గత 20 రోజుల్లోనే నాలుగుకుపైగా కొండ చిలువలు పొలాల్లో పట్టుబడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-10-13T04:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising