ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవస్థానం తరుపున నాణ్యమైన సరుకులు కొనుగోలు

ABN, First Publish Date - 2022-07-04T05:17:21+05:30

శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవా లయంకు సరఫరా చేసే పలురకాల సరుకులు టెండరుదారులు నాణ్యత లేకుం డా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పాలకమండలి ఆదివారం సాయంత్రం చైర్మ న్‌ కోట శ్రీనివాసకుమార్‌ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాలకమండలి  నిర్ణయం

శింగరకొండ(అద్దంకి), జూలై 3: శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవా లయంకు సరఫరా చేసే పలురకాల సరుకులు టెండరుదారులు నాణ్యత లేకుం డా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పాలకమండలి ఆదివారం సాయంత్రం చైర్మ న్‌ కోట శ్రీనివాసకుమార్‌ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవు నెయ్యి, కిస్మిస్‌, జీడిపప్పు, యాలుకలు, ఇంగువ, చింత పండు, బియ్యం, పచ్చిశనగపప్పు, జాజికాయలను దేవస్థానం తరపున ఈవో ఆ ధ్వర్యంలో నేరుగా  కొను గోలు చేసేవిధంగా నిర్ణయించారు. సమావేశంలో ఈవో రఘనాథరెడ్డి, ధర్మకర్తలు అన్నాబత్తిన సీతారామ య్య, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, జమ్మలమడక రమాదేవి, జ్యోతి చంద్రమౌళి, కుందుర్తి రజనీ, ఎర్రిబోయిన రమణమ్మ, ఎక్స్‌అఫిసియో మెంబర్‌ కోట  లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

షాడోల పెత్తనంపై అభ్యంతరం

అద్దంకి, జూలై3: శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్తానం పాలక మం డలిలో షాడోల పెత్తనం పై అధికారులు అభ్యంత రం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. శింగర కొండ పాలక మండ లిలో ఇద్దరు మహిళా సభ్యుల భర్తలు శింగరకొండలో పెత్తనం చెలాయించటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆదివారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశం సమయంలో కూడా మహిళా సభ్యులతో పాటు భర్తలు కూడా దేవస్థానం వద్దకు వచ్చారు. వారు సమావేశంకు రావటంతో ఈవో రఘనాథరెడ్డి అభ్యంతరం చెప్పినట్లు తె లుస్తుంది. ఈ నేపథ్యంలో సమావేశం ముగిసే వరకు బయటకు వెళ్లిన ఇద్దరిని సమావేశం ముగిసిన తరువాత మరలా  చైర్మన్‌ చాంబర్‌లోకి పిలిపించినట్లు తె లుస్తుంది. ఈక్రమంలో ఈవో రఘునాథరెడ్డికి, పాలకమండలిలోని ఓ సభ్యురాలి భర్త మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఈవోని వివరణ కోరగా సమావేశంకు సభ్యులు మాత్రమే హాజరయ్యారని, సమావేశం ముగిసిన తరువాత మహిళా సభ్యుల  భర్తలు చాంబర్‌కు వచ్చారని  తెలిపారు.

Updated Date - 2022-07-04T05:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising