ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ప్రయాణం.. ప్రమాదం

ABN, First Publish Date - 2022-08-12T03:29:52+05:30

దర్శి ప్రాంతంలో ఆటోలో ప్ర యాణం ప్రమాకరంగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పరిమితికి మించి ఆటోల్లో నిల్చొని ప్ర యా ణం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆటోలో నిల్చుని వెళ్తున్న ప్రయాణికులు

 పరిమితికి మించి ఎక్కుతున్న ప్రయాణికులు 

 గ్రామాలకు తగ్గిన ఆర్టీసీ బస్సు సర్వీసులు

దర్శి, ఆగస్టు 11 : దర్శి ప్రాంతంలో ఆటోలో ప్ర యాణం ప్రమాకరంగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పరిమితికి మించి ఆటోల్లో నిల్చొని ప్ర యా ణం చేస్తున్నారు. ఆటో నిర్వాహకులు నిబంధనలు ప ట్టించుకోకుండా ఎక్కువ మందిని ఎక్కించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఆటో స్ధాయికి మించి ప్రయాణికులు ఎక్కడంతో అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా గమ్యం చేరాలనే లక్ష్యంతో డ్రైవర్లు అతివేగంగా ప్ర యాణిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. ఆటోల్లో అధికలోడ్‌తో ప్ర యాణిస్తున్న ఆటో లను నియంత్రించాల్సిన అధికా రులు పట్టించుకోవటం లేదు. కొంతమంది గూడ్స్‌ ఆట్లోల్లోకూడా ప్రయాణికు లను ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. 

ఆర్టీసీ బస్సుల కొరతే ప్రధాన కారణం

ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రమైనందున ప్ర జలు చేసేది లేక ఆటోల్లో ప్రయా ణిం చాల్సి వస్తోంది. గతంలో వివిధ రోడ్లల్లో తిరిగిన అనేక బస్సు లను రద్దు చేశారు. ప్రధాన పట్టణాలకు వెళ్లే బస్సులను కూడా తగ్గించారు. గతంలో నడిచిన దర్శి - సామంత పూడి, దర్శి - ఆరవళ్లిపాడు, దర్శి - పోతవరం, దర్శి పాపి రెడ్డిపాలెం, దర్శి శ్రీరాంపురం రోడ్లకు ఆర్టీసీ బస్సులు నడి చే వి. ప్రస్తుతం ఎంతో కాలంగా ఈ బస్సులు నడపడం లేదు. ప్రధాన రహదారులైన దర్శి - పొదిలి, దర్శి - అద్దంకి, దర్శి - విను కొండ ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా తగ్గించారు. రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య తగ్గించడంతో ప్రజలు ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో ఆటోల్లో వెళ్తున్నారు. ఆటోవాలాలు  బస్సులు ఆగే స్థలాల్లోనే ఆటోను నిలబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్యాసింజర్లను ఎక్కిస్తున్నారు. ఓవర్‌లోడ్‌ ప్ర యాణం అరికట్టాల్సిన రావాణా, పోలీసు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లే వు,. కొన్ని ఆటోలు ఫిట్‌నెస్‌ లేకపోయినా ప్రయాణికులను ఎక్కించుకొని నడుపు తున్నారు. ఆటోలు ఒవర్‌లోడ్‌తో ప్రయా ణించడంతో ఇటీవల కాలంలో ప్రమా దాలు తరచూ జరుగుతున్నాయి. పలు వురు ప్రాణాలను కూడా కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. అధికా రులు ఆటోలను క్రమబద్ధీకరించి సరైన మా ర్గంలో నడిపించకపోతే రోడ్డు ప్ర మాదాలు మరింత పెరిగే పరిస్థితి లేకపోలేదు.


Updated Date - 2022-08-12T03:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising