ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్‌ వాయిదా

ABN, First Publish Date - 2022-08-09T05:10:25+05:30

వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని ఏఎన్‌ఎంలకు నిర్వహించాలని కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా ఏఎన్‌ఎం ఉండే విధంగా రెగ్యులర్‌, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను కౌన్సెలింగ్‌ ద్వారా నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేయడంతో అందుకు అనుగుణంగా సోమవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మీ కౌన్సెలింగ్‌కు ఏర్పాటు చేశారు అయితే జిల్లావ్యాప్తంగా 224 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వ రాజ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈనెల 11 లేదా 12 తేదీల్లో జరిగే అవకాశం

పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌


ఒంగోలు(కలెక్టరేట్‌); ఆగస్టు 8: వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని ఏఎన్‌ఎంలకు నిర్వహించాలని కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా ఏఎన్‌ఎం ఉండే విధంగా రెగ్యులర్‌, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను కౌన్సెలింగ్‌ ద్వారా నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేయడంతో అందుకు అనుగుణంగా సోమవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మీ కౌన్సెలింగ్‌కు ఏర్పాటు చేశారు అయితే జిల్లావ్యాప్తంగా 224 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులన్ని పశ్చిమప్రాంతంలోనే ఎక్కువగా ఉండటంతో ఏఎన్‌ఎంలలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎఎన్‌ఎంలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన కౌన్సెలింగ్‌లో ఏఎన్‌ఎంలతో కలిసి ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి సుదూర ప్రాంతాలకు పోవాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఇంకొకవైపు రాష్ట్రస్థాయిలో కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కమిషనర్‌ కౌన్సెలింగ్‌పై డీఎంహెచ్‌ఓలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి మరలా మార్గదర్శకాలు జారీచేస్తామని, అందుకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఈనెల 11  లేదా 12వ తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది.


డీఎంహెచ్‌ఓను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు

కాగా సోమవారం ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్‌పై అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మీని కలిశారు. ఎన్‌జీవో సంఘం జి ల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు ఆధ్వర్యంలో ఎన్‌జీవో సంఘం నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌ రెడ్డిల నేతృత్వంలో ఆయా సంఘాల నాయకులు కౌన్సెలింగ్‌ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్‌ను వాయిదా వేసి మెరిట్‌ జాబితాను రూపొందించి అందుకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. ఒకవైపు సంఘాల వత్తిళ్లు, ఇంకొక వైపు కమిషనర్‌ ఆదేశాలలతో సోమవారం జరగాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదాపడింది. 


Updated Date - 2022-08-09T05:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising