ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు గెలవాలని మొక్కులు మొక్కా..పందెం కట్టా

ABN, First Publish Date - 2022-05-22T05:58:41+05:30

ఎన్నికలకు ముందు మీరు ఎమ్మెల్యేగా గెలవాలని, గెలుస్తారని దేవుణ్ని మొక్కాను. పందెం కాశాను. అయినా నాకు అన్యాయం చేశారు.

ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్థుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాకు అన్యాయం చేశారు 

ఇంటి స్థలమిచ్చి ఆదుకోండి

ఎమ్మెల్యే వద్ద వంగపాడు గ్రామస్థుడి మొర

కనిగిరి, మే 21 : ఎన్నికలకు ముందు మీరు ఎమ్మెల్యేగా గెలవాలని, గెలుస్తారని దేవుణ్ని మొక్కాను. పందెం కాశాను. అయినా నాకు అన్యాయం చేశారు. ఆ రోజు మీరు గెలవరని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు మీ పక్కన తిరుగుతున్నారు. మిమ్మల్నే నమ్ము కున్న మా లాంటి వారికి ఉత్త చెయ్యే మిగిలిందని ఎమ్మెల్యే మధు సూదన్‌యాదవ్‌ ఎదుట ఓ వ్యక్తి  ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన మండలంలోని వంగపాడు గ్రామంలో శనివారం గడప గడపకు కార్యక్రమంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వంగ పాడు గ్రామంలో కాలనీల పేరుతో అనుయాయులకు ఇంటి స్థలాలు ఇచ్చారని, అర్హత ఉండి కూడా మాకెందుకు ఇవ్వలేదని, మాకు స్థలం ఇవ్వాలని ఆయా గ్రామస్థుడు చేతులెత్తి మొక్కాడు. దీంతో కాలనీల కోసం సేకరించిన స్థలంలో ఎంత మందికి వస్తాయో అంత మందికి ఇచ్చాం. మీకు కూడా స్థలం చూశాక  ఇప్పిస్తాం అంటూ ఎమ్మెల్యే మాట దాటేశారు. దీంతో  గ్రామస్థుడు ఇది కూడా ప్రభు త్వ స్థలమే ఇందులో ఇంకా చాలా మందికి ఇచ్చే అవకాశం ఉంది సారూ అంటూ ఓ స్థలాన్ని చూపించాడు. ఒక్కసారిగా ఎమ్మెల్యేకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అయినా నీవు చెప్పినంత మాత్రాన ఆ స్థలంలో నీకెలా ఇస్తారు. రెవెన్యూ యంత్రాంగం చూడాలి, నిర్థారించాలి, ఇంటి స్థలాలకు అనువైనదో కాదో చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వ స్థలం అని ధ్రువీకరించారని బాధుతుడు పేర్కొంటూ మాకివ్వడానికి మాత్రం కుదరదు. ఎందుకంటే మేం మీకు ఓట్లేసాం కదా న్యాయం చెయ్యండయ్యా అంటూ వేడుకున్నాడు. ఈ సంఘ టనతో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ప్రకాశం, జడ్పీటీసీ సభ్యుడు కస్తూరిరెడ్డి, రంగనాయకులరెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising