ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీనమేషాలు ఎవరి కోసం?

ABN, First Publish Date - 2022-03-20T06:54:38+05:30

ఎర్రగొండపాలెంలో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో రెవెన్యూ, పోలీసు పాత్ర, వైఫల్యాలు కీలకంగా మారాయి.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నఎస్పీ మలికగర్గ్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైపాలెం హత్య వెనుక రెవెన్యూ, పోలీసు పాత్రపై పెరుగుతున్న అనుమానాలు 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎర్రగొండపాలెంలో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో రెవెన్యూ, పోలీసు పాత్ర, వైఫల్యాలు కీలకంగా మారాయి. అయినప్పటికీ బాధ్యులపై చర్యల విషయంలో ఆ రెండు శాఖల ఉన్నతాధికా రులు మీనమేషాలు లెక్కిస్తుండటం చర్చనీయాంశ మైంది. హతుని కుటుంబీకులు పోలీసు వైఫల్యాలను ఎత్తిచూపారు. స్థానిక రెవెన్యూ అధికారినైతే నిందితుడని కేసులో పేర్కొన్నారు. అందుకనుగుణంగా స్థానిక అధికారుల పాత్రపై ప్రజలంతా పలు ఆరోపణలు చేస్తున్నారు. వైపాలెంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆదినారాయణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో స్థానిక వైసీపీ నేత కె.గురుప్రసాద్‌ తోపాటు ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ వీరయ్యలపైన కేసు నమోదైంది. దీంతో ఈ హత్యకు అసలు కారణాలు ఏమిటి, వైపాలెంలో అసలు ఏమి జరుగుతుం దన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిందితుల జాబితాలో ఉన్న తహసీల్దార్‌, మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గురు కూడా మంత్రి సురేష్‌కి సన్నిహితులని, ఈ హత్యకు వారే కారణమన్న ఆరోపణలు ఆరంభంలోనే వచ్చాయి. అయితే వెంటనే ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎస్పీ మల్లికగర్గ్‌ తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు పూర్తిచేసి తక్షణం నిందితులందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయకపోవటాన్ని అటుంచితే స్థానిక పోలీసులపై వచ్చిన ఆరోపణలను ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. 


రక్షణ అడిగితే పట్టించుకోని పోలీసులు

తప్పొప్పులను అటుంచితే ఆదినారాయణ (మృతుడు)ను హత్య చేసేందుకు నెల క్రితమే ప్రయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుప్రమాదం రూపంలో అతనిని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు పోలీసులు ప్రాధాన్యం ఇవ్వలేదు.. తనకు ప్రాణరక్షణ కల్పించాలని  ఆదినారాయణ వేడుకున్నా సంబంధిత పోలీసు అధికారి తోసిపుచ్చారు. తనకున్న ప్రాణహానిని గుర్తించి కాబోలు హతుడు ఆదినారాయణ పోలీసుల ద్వారా రక్షణ పొందే అంశంపై కోర్టుకు కూడా వెళ్లారు. అయినా స్థానిక పోలీసు అధికారుల్లో చలనం లేదు. పోలీసు శాఖకు స్పెషల్‌ బ్రాంచి, గూఢచార విభాగాలు రెండు కళ్లుగా భావిస్తారు. మరి వారి నుంచి కూడా సమాచారం అందిందో లేదో కాని ఆదినారాయణ ముందస్తు వేడుకోళ్లను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబసభ్యులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.  


చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు

 మరోవైపు నిందితుడిగా ఉన్న ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ వీరయ్య వ్యవహారంపై కలెక్టర్‌ నుంచి కానీ, ఆ కిందిస్థాయి రెవెన్యూ అధికారుల నుంచి కానీ కనీస స్పందన లేకపోగా ఆయన స్థానికంగానే విధుల్లో ఉండటం చర్చనీయాంశమైంది. ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ వీరయ్య స్వగ్రామం వైపాలెం మండలంలోని గుర్రపుశాల. సొంత మండలానికి తహసీల్దార్‌గా నియమించకూడదనేది ప్రభుత్వ నిబంధన. పైగా ఆయన పక్కనున్న పుల్లలచెరువు మండలంలో ఆర్‌ఐగా పనిచేస్తూ డీటీగా ఉద్యోగోన్నతి పొందిన పదిరోజులకే వైపాలెం ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. తదనంతరం ఆయన గుర్రపుశాలకు తన సతీమణిని వైసీపీ మద్దతుతో అధికార దుర్వినియోగం చేసి సర్పంచ్‌ని కూడా చేశారు. తద్వారా అధికార పార్టీలో అతని పవర్‌ ఏమిటో తేటతెల్లమవుతుంది. వీటికి తోడు మార్కాపురంలో ఆర్‌ఐగా పనిచేసినప్పటి నుంచి ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా వీరయ్య వ్యవహారంపై ఉన్నతాధికారులు నోరు మెదపకపోవటం ఆలోచించాల్సిన విషయమే.


Updated Date - 2022-03-20T06:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising