ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ పేకాట దొంగగా మార్చింది!

ABN, First Publish Date - 2022-12-13T01:15:31+05:30

చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థి దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అమ్మానాన్న కాలేజీ ఫీజు కట్టేందుకు ఇచ్చిన డబ్బును ఆన్‌లైన్‌ పేకాటలో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. ఫీజు కట్టడం ఎలాగో తెలియక చివరకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి మొడలో బంగారం గొలుసు లాక్కొని పరుగు లంకించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టుబడ్డ విద్యార్థి

వేగంగా స్పందించిన హోంగార్డులు

అభినందించిన ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం), డిసెంబరు 12 : చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థి దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అమ్మానాన్న కాలేజీ ఫీజు కట్టేందుకు ఇచ్చిన డబ్బును ఆన్‌లైన్‌ పేకాటలో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. ఫీజు కట్టడం ఎలాగో తెలియక చివరకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి మొడలో బంగారం గొలుసు లాక్కొని పరుగు లంకించాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న ఇరువురు హోంగార్డులు వేగంగా స్పందించారు. ధైర్యంగా వెంటపడి సుమారు రెండు వందల మీటర్లు పరుగు తీసి యువకుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లోని 12వ నెంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద తిరుపతి వెళ్లేందుకు కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం శ్రీరంగపురానికి చెందిన నారాయ ణం బాలదుర్గ దంపతులు వేచి ఉన్నారు. అదే సమయంలో సంతనూతలపాడుకు చెందిన ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బాలదుర్గ మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరుగెత్తాడు. బాధితురాలు, ప్రయాణికులు కేకలు వేయడంతో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డులు డి.బాబూరావు, జి.హనుమంతరావు అప్రమత్తమయ్యారు. దొంగతనం చేసి పరిగెడుతున్న యువకుడి వెంటపడి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గొలుసును స్వాధీనం చేసుకొని ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. బాలదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

హోంగార్డులను అభినందించిన ఎస్పీ

వేగంగా స్పందించి వెంటపడి యువకుడిని పట్టుకున్న హోంగార్డులు బాబూరావు, హనుమంతరావులను ఎస్పీ మలికగర్గ్‌ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ ఉన్నారు.

Updated Date - 2022-12-13T01:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising