ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

ABN, First Publish Date - 2022-01-19T05:09:03+05:30

ఆ యిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈసంఘటన మంగళవారం మండలంలో ని బల్లిపల్లి వద్ద చోటుచేసుకొంది.

ఓమిని వ్యాన్‌ను ఢీకొట్టి బోల్తాపడిన ఆయిల్‌ ట్యాంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, జనవరి 18 : ఆ యిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈసంఘటన మంగళవారం మండలంలో ని బల్లిపల్లి వద్ద చోటుచేసుకొంది. వైజాగ్‌ నుంచి ఆయి ల్‌ ట్యాంకర్‌ కనిగిరి మీదు గా రాయచోటి వెళ్తుంది. మార్గమధ్యంలో బల్లిపల్లి రోడ్డువద్ద వంతెన చప్టాను ఢీకొని బోల్తాపడింది. ఇదే క్రమంలో పామూరు నుంచి కనిగిరికి వస్తున్న ఓమిని వ్యాన్‌ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి ఆగింది. వ్యాన్‌లో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయిల్‌ ట్యాంక్‌ లీకై పెట్రోల్‌, డీజిల్‌ అంతా నేలపాలైంది. ట్యాంకర్‌ చక్రాల వద్ద నిప్పురవ్వలు ఏర్పడి ఆగిపోయాయి. ఆ సమయంలో ట్యాంకర్‌ పేలుతుందని స్థానికులు భయాందోళన చెందారు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రామిరెడ్డి, ఫైర్‌ ఆఫీసర్‌ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఏర్పడకుండా అగ్నిమాపక సిబ్బంది రామస్వామి, చిరంజీవి, సురేష్‌, శ్రీనివాసులు, కొండలరావులు ముందు జాగ్రత్త చర్యగా స్ర్పే కొట్టారు. అనంతరం క్రేన్‌ల ద్వారా లారీని పైకి లేపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-19T05:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising