ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచినీటి చెరువులకు చేరుతున్న సాగర్‌ జలాలు

ABN, First Publish Date - 2022-06-30T04:57:09+05:30

మండలంలోని తాగునీటి చెరువులకు రెండు రోజుల నుంచి సాగర్‌ జలాలు చేరుతున్నాయి.మండలంలో 14 నోటిఫైడ్‌ చెరువులున్నాయి. గన్నవరం చెరువు కట్ట మరమ్మతుల నిమిత్తం చెరువులోని నీటిని బయటకు పంపించారు. ప్రస్తుతం మరమ్మతుల పనులు పూర్తికావడంతో బుధవారం ఉదయం చెరువుకు సాగర్‌ జలాలు చేరుతున్నాయి.

గన్నవరం చెరువుకు చేరుతున్న సాగర్‌ జలాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యద్దనపూడి, (మార్టూరు) జూన్‌ 29: మండలంలోని తాగునీటి చెరువులకు రెండు రోజుల నుంచి సాగర్‌ జలాలు చేరుతున్నాయి.మండలంలో 14 నోటిఫైడ్‌ చెరువులున్నాయి. గన్నవరం చెరువు కట్ట మరమ్మతుల నిమిత్తం చెరువులోని నీటిని బయటకు పంపించారు. ప్రస్తుతం మరమ్మతుల పనులు పూర్తికావడంతో బుధవారం ఉదయం చెరువుకు సాగర్‌ జలాలు చేరుతున్నాయి. బొబ్బేపల్లి దండుదారి దగ్గర ఉన్న ఎన్‌ఏపీ పైపులైను ద్వారా యద్దనపూడి, వింజనంపాడు, చిలుకూరివారిపాలెం, చింతపల్లిపాడు, అనంతరం, యనమదల చెరువులకు నీటిని పంపిస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ బ్రహ్మయ్య తెలిపారు. 

అన్ని గ్రామాల చెరువులకు నీరు

 మండలంలో అన్ని గ్రామాల మంచినీటి చెరువులకు సాగర్‌ జలాలును పంపిస్తున్నట్లు ఏఈ రవి బుధవారం తెలిపారు. రాజుపాలెం మేజరు ద్వారా మేజరు పంచాయతీ మార్టూరు చెరువుకు రెండు రోజుల నుంచి నీటిని పంపిస్తున్నారు. జొన్నతాళి చెరువులో నాచును, జమ్మును తొలగిస్తుండటంతో గురువారం నుంచి ఈ చెరువుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఇక సాగర్‌ జలాల విషయానికి వస్తే బొల్లాపల్లి జీఎన్‌టీ దగ్గర 400 క్యూ, యద్దనపూడి మేజరు వద్ద 275క్యూ, కోటపాడు మేజరు 125, ద్రోణాదుల మేజరు వద్ద 130, నూతలపాడు మైనరు వద్ద 130, పమిడిపాడు మేజరు వద్ద 300, రాజుపాలెం మేజరు వద్ద 40 క్యూసెక్కులు నీరు వస్తున్నట్లు ఎన్‌ఎ్‌సపీ ఏఈ సుధీర్‌ తెలిపారు.   


Updated Date - 2022-06-30T04:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising