ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయ స్వామి వేషధారణతో నూకాజీ

ABN, First Publish Date - 2022-05-28T06:31:37+05:30

రెండు తెలుగు రాష్ర్టాలలో కళాకారులకు ఆదరణ కరువైందని, కళాకారులకు కనీసం గౌరవ వేతనం ఇప్పించాలని చంద్రబాబుని కోరుతూ చేతిలో వినతిపత్రం పట్టుకుని ఓ కళాకారుడు వినూత్నంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఆంజనేయ స్వామి వేషధారణతో నూకాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధి కరువైంది.. గౌరవ వేతనం ఇప్పించండి

మహానాడులో ఆంజనేయ స్వామి వేషధారణతో కళాకారుడు

ఒంగోలు (కల్చరల్‌), మే 27 : రెండు తెలుగు రాష్ర్టాలలో కళాకారులకు ఆదరణ కరువైందని, కళాకారులకు కనీసం గౌరవ వేతనం ఇప్పించాలని చంద్రబాబుని కోరుతూ చేతిలో వినతిపత్రం పట్టుకుని ఓ కళాకారుడు వినూత్నంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. మహానాడు ప్రాంగణంలో శుక్రవారం నూకాజీ అనే కళాకారుడు ఆంజనేయ స్వామి వేషధారణ, చేతిలో వినతిపత్రంతో అక్కడి వచ్చే పార్టీ అభిమానులు, ప్రతినిధులు, ప్రజల మధ్య తిరుగుతూ సందడి చేశాడు. న్యాయవాద డిగ్రీ చేసిన నూకాజీ గతంలో వివిధ వేషధారణలతో ‘ఆర్టీసీలోనే ప్రయాణించండి’, కరోనా భూతంపై మేలుకొలుపు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై అవగాహన వంటి పలు అంశాలపై తన వేషధారణలతో ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. 52 ఏళ్ల వయస్సు ఉన్న నూకాజీ టీడీపీ వీరాభిమాని. నిరుపేద కళాకారుడినైన తనకు ప్రస్తుతం ఉపాధి కరువైందని, నెలనెలా కళాకారులకు పెన్షన్‌ ఇప్పించే విధంగా చేయాలని చంద్రబాబుకు వినతిపత్రం ద్వారా కోరారు. 

Updated Date - 2022-05-28T06:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising