ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జాతీయ లోక్‌అదాలత్‌

ABN, First Publish Date - 2022-06-25T06:06:59+05:30

జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ.భారతి తెలిపారు.

ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి 

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 24 :  జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో  ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ.భారతి  తెలిపారు.  రాజీ పడదగిన అన్ని క్రిమినల్‌, సివిల్‌, వివాహ సంబంధ, చెక్‌బౌన్స్‌ కేసులతోపాటు మెటార్‌ వాహన బీమా పరిహారం చెల్లింపు కేసుల్లో ఇరువర్గాల వారు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా తమ న్యాయవాదుల సమక్షంలో  పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి పొందిన రుణాల కేసులు పరిష్కరిస్తామన్నారు. భాగ పంపిణీ కేసులను వారి కుటుంబసభ్యుల సమక్షంలో పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


కారుణ్య నియామకపత్రం అందజేత

కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం రాకపోవడంతో వడ్లమూడి అపరాజిత జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించారు. దీంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రభుత్వ శాఖలకు నోటీసును పంపి మూడు నెలల్లో ఉద్యోగం ఇప్పించింది. ఆ నియామకపత్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి ఈ సందర్భంగా అపరాజితకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు ఉన్నారు. 


Updated Date - 2022-06-25T06:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising