ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్జీసీ చార్జీల పెంపుతో పేదలపై మరింత భారం

ABN, First Publish Date - 2022-07-02T05:30:00+05:30

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద, మధ్యతర గతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి ఎం ఎం కొండయ్య అన్నారు.

చీరాలలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నిరసన

చీరాల, జూన్‌ 2: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద, మధ్యతర గతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి ఎం ఎం కొండయ్య అన్నారు.  ఈతరుణంలో  ఆర్టీసీ చా ర్జీల పెంపుతో పేదవాడి పై మరింత భారం పడు తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా  పెంచిన బస్సు చార్జీలకు నిరసనగా స్థానిక గడియార  స్తంభం సెంటర్లో శనివారం కొండయ్య ఆధ్వర్యంలో నిరస న కార్యక్రమం చేపట్టారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే వి గ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ర్యాలీ గా ముక్కోణపుపార్కు సెంటర్‌కు చేరారు. అక్కడ డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేశారు. తదనంతరం ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుని, అక్కడ నుంచి స్థానిక బస్టాండ్‌ ప్రవేశమార్గం వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డగించి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. అప్పులు చేయ టం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అరాచకపాలన సాగించటం త ప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించటంలేదని ధ్వజమెత్తారు.  అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటువేసి చంద్ర బాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్ర మంలో టీడీపీ ముఖ్య నాయకులు నాశిక వీరభద్రయ్య, జి. చంద్రమౌ ళి, కౌతవరపు జనార్దనరావు, తేజ, నాయకులు,  పెద్దసంఖ్యలో కార్య కర్తలు పాల్గొన్నారు.


అన్నంబొట్లవారిపాలెంలో..

అన్నంబొట్లవారిపాలెం(పర్చూరు), జూలై 2: విద్యుత్‌, బస్సు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, నిత్యవసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ మండలం లోని అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో శనివారం టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పర్చూరు - చిలకలూరిపేట ఆర్‌అండ్‌బీ రహదారిపై ధరల పెంపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. అనంతరం గ్రామంలో వైసీపీ పాలనపై బాదుడే బాదుడు ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం అదనపు భారం మోపుతూ తీవ్ర ఇబ్బం దులకు గురిచేస్తుందన్నారు. 

కార్యక్రమంలో సర్పంచ్‌ నెల్లూరి అనంతమ్మ, ఎంపీటీసీ చెన్నుపాటి రమాదేవి, అప్పలనేని నరేంద్ర, ఉపసర్పంచ్‌ అప్పలనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising