ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రి హామీ

ABN, First Publish Date - 2022-01-29T05:50:51+05:30

అద్దంకి కేంద్రంగా రెవె న్యూ డివిజన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్లు శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య తెలిపారు.

మంత్రి బాలినేనికి వినతిపత్రాన్ని అందజేస్తున్న కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైత న్య 

 

అద్దంకి, జనవరి  28: అద్దంకి కేంద్రంగా రెవె న్యూ డివిజన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్లు శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య తెలిపారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని కోరుతూ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌లను నియోజకవర్గ నాయకులతో కలిసి వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. అ ద్దంకి నియోజకవర్గాన్ని దూరంగా ఉన్న బాపట్ల జిల్లాలో కలపటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బాపట్ల జిల్లాలో కొనసాగించే పరిస్థితులలో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పం దించిన మంత్రి బాలినేని అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ట్లు తెలిపారు. శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, సంతమాగులూరు ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చింతల  పేరయ్య, జ్యోతి హనుమంతరావు, కాకాని రాధాకృష్ణమూర్తి, అవిశన ప్రభాకరరెడ్డి, సందిరెడ్డి రమేష్‌, సాధినేని మస్తాన్‌రావు, చింతా రామారావు, కోటిరె డ్డి, బొల్లినేని రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising