ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ

ABN, First Publish Date - 2022-08-20T04:54:50+05:30

ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశా రు. షాపు పైకప్పు రేకులకు రంద్రం వేసి లోపలకు దూరా రు. లాకర్‌లో ఉన్న రూ. 2,34,660 నగదు, ఒక ల్యాప్‌టాప్‌, రెండు ఫుల్‌ బాటిళ్ల మద్యాన్ని అపహరించుకుపోయారు.

షాపు పైరేకులకు కన్నం వేసిన దొంగలు(ఇన్‌సెట్లో) ప్రభుత్వ వైన్‌ షాపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.2,34,660 నగదు, ల్యాప్‌టాప్‌, రెండు ఫుల్‌ బాటిళ్లు తస్కరణ

ఫిర్యాదు ఇవ్వని ఉద్యోగులు

సొంత వారే ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానాలు?


ముండ్లమూరు, ఆగస్టు 19 : ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశా రు. షాపు పైకప్పు రేకులకు రంద్రం వేసి లోపలకు దూరా రు. లాకర్‌లో ఉన్న రూ. 2,34,660 నగదు, ఒక ల్యాప్‌టాప్‌, రెండు ఫుల్‌ బాటిళ్ల మద్యాన్ని అపహరించుకుపోయారు. షాపునకు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. శుక్రవారం ఉదయాన్నే షాపు తీయటానికి వచ్చిన సేల్స్‌మెన్‌లకు కప్పునకు రంద్రం కనిపించడంతో చోరీ జరిగినట్లు భావించారు. లాకర్‌ చూడగా నగదు లేకపోవడంతో ముండ్లమూ రు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వచ్చి చూశా రు. అయితే ప్రభుత్వ షాపులో పనిచేస్తున్న సూపర్‌వైజర్‌ గానీ, సేల్స్‌మెన్‌లు గానే పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. షాపులో పని చేసే సిబ్బందే దొంగతనానికి పాల్పడి కట్టుకథ అల్లినట్టు ప్రజలు అనుమానిస్తున్నారు. ముండ్లమూరులోని తాళ్లూ రు బస్టాండ్‌ సెంటర్‌లో వైన్‌ షాపు ఉండటం, ఆ షాపు సమీపంలోనే చిల్లర దుకాణాలు ఉండటంతో దొంగలు చోరీ చేసేందుకు సాహసం చేయరనే వాదన కూడా ఉంది. 


గతంలో మారెళ్లలో... 

మారెళ్లలో కూడా గత ఏడాది వైన్‌షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి అందులో రెండు లక్షల రూపాయల వరకు డబ్బు తీసుకువెళ్లినట్టు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించగా ఇందులో పనిచేసే సిబ్బందే తీసినట్టు నిర్ధారించుకొని వారి చేతనే నగదు కట్టించారు. ప్రస్తుతం ముండ్లమూరులో కూడా అదేవిధంగా దొంగతనం జరగటంతో సిబ్బందే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


సిబ్బందిని కాపాడే ప్రయత్నంలో ఎస్‌ఈబీ పోలీసులు 

ప్రభుత్వ వైన్‌షాపుల్లో దొంగతనానికి పాల్పడిన వెంటనే సివిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ముండ్లమూరులో వైస్‌ షాపులో దొంగతనం జరిగి 24 గంటలు గడిచినా పోలీసు స్టేషన్‌లో ఏ మాత్రం ఫిర్యాదు చేయకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-08-20T04:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising