ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోటరీ చరిత్రలో మార్టూరుకు ప్రత్యేక స్థానం

ABN, First Publish Date - 2022-07-05T06:33:02+05:30

సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యలను అధ్యయనం చేసి తమ వంతు బాధ్యతగా స్పందిస్తున్న మార్టూరు రోటరీ క్లబ్‌కు రోటరీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని ముఖ్య అతిథి ఇన్‌స్టాలేషన్‌ ఆఫీసర్‌ బి.శంకరరెడ్డి అన్నారు.

ప్రమాణ స్వీకారంలో రొటేరీయన్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్టూరు, జూలై 4: సమాజంలోని అన్ని  వర్గాల వారి సమస్యలను అధ్యయనం చేసి తమ వంతు బాధ్యతగా స్పందిస్తున్న మార్టూరు రోటరీ క్లబ్‌కు రోటరీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని ముఖ్య అతిథి ఇన్‌స్టాలేషన్‌ ఆఫీసర్‌ బి.శంకరరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి స్థానిక యఫర్ట్‌ కార్యాలయం ఆవరణంలో మార్టూరు రోటరీ నూతన కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్య క్రమం జరిగింది.  కార్యక్రమానికి యఫర్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జాష్టి వెంకట మోహనరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.శంకరరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల మార్టూరు రోటరీ క్లబ్‌కు 27 అవార్డులు సాధించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన రోటరీ 3150 అసిస్టెంట్‌ గవర్నర్‌ గల్లా సాంబశివరావు మాట్లాడుతూ సమాజంలో పాతుకుపోయిన మూడనమ్మకాలను, సమస్య లను వాస్తవిక ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ప్రజలను చైతన్య వంతులను చేసే దిశగా కళాపరిషత్‌ నాటిక పోటీలను మార్టూరు రోటరీ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం డివిజనల్‌ సెక్రటరీ ఎస్‌. దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీ పాలక వర్గం ప్రమాణస్వీకారం చేసింది. 2022-23నకు రోటరీ అధ్యక్షుడిగా కొర్రపాటి కాజారావు, కార్యదర్శిగా కుర్రా వెంకట.రామయ్య, ట్రెజరర్‌గా గరిమిడి శ్రీనివాసరావులతో పాటు మరికొంతమంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిని పాస్ట్‌ కమిటీ అధ్యక్షుడు ఇంటూరి అంజనేయులు, రావి అంకమ్మ చౌదరి తది తరులు అభినందించారు. కార్యక్రమంలో మాజీ రోటరీ అధ్యక్షుడు చెన్నుపాటి బసవరాముడు, జాష్టి సాంబశివరావు, షేక్‌ కాజా హుస్సేన్‌, పావూలూరి వెంకట కృష్ణరావు, యం. ఈశఽ్వరప్రసాద్‌, వి. శేషుబాబు, శానంపూడి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising