కన్నీరు మిగిల్చిన మాండస్
ABN, First Publish Date - 2022-12-15T23:45:18+05:30
: ఇటీవల కురిసిన భారీవర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చా యి. వివిధ పైర్లకు చీడపీడలు సోకడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
విజృంభించిన చీడపీడలు
కొనకనమిట్ల, డిసెంబరు 15 : ఇటీవల కురిసిన భారీవర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చా యి. వివిధ పైర్లకు చీడపీడలు సోకడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబరు నెలలో సాధా రణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలపై తీవ్రప్రభావం చూపింది.
మండలంలో 1000 ఎకరాలకు పైగా మిరప సాగు చేశారు. కోట్లాది రూపాయులు ఖర్చుపెట్టి సాగుచేసిన మిరప తోటలను భారీవర్షాలతో తీవ్రంగా దెబ్బ తిన్నాయి. పలు గ్రామాల్లో లోతట్టు భూ ముల్లో సాగు చేసిన మిరప తోటలు నీట మునిగాయి. దీనికి తోడు నల్లతామర, తెల్లతామర, కుచ్చు తెగులు లాంటి చీడ పీడలు విజృంభించాయి. ఎన్ని రకాలు క్రిమిసంహారక మందులు వాడుతున్నప్పటికీ తెగుళ్లు అదుపులోకి రావడంలేదని పుట్లూరివారిపల్లి గ్రామానికి చెందిన బయ్యన్న అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 6500 వేల ఎకరాలకుపైగా శనగ పైరు సాగు చేపట్టారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా శనగ ఇప్పటికే దెబ్బతింది. కొంత భాగం నీటిలో ఉండడంతో మళ్లీ విత్తుకోవాల్సిన పరిస్థితి ఎర్పడింది. అక్టోబరు మాసాల్లో సాగు చేసిన ముదురు పొగాకు తోటలు వర్షం కారణంగా మడ్డి కారిపోయి రంగు కోల్పోయే ప్రమాదం ఉందని చినారికట్ల గ్రామానికి మారవతు చినయోగయ్య తెలిపారు. ఆందోళన వ్యక్తం చేశారు. 2000 ఎకరాలకుపైగా సాగు చేసిన బొబ్బర్లు అతి వర్షాల కారణంగా ఇప్నపటికే పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 10 వేల ఎకరాలకుపైగా కంది సాగు చేపట్టారు. ముసురు వర్షాలతో పూతకళ్లె రాలిపోయే పరిస్థితి నెలకొంది. మినుము ఉరకెత్తి దెబ్బతినే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు. మండలంలో పంటనష్టంపై సమగ్ర విచారణ జరిపి నష్టపోయిన రైతులకు సాయం అందించాలని పలురైతులు కోరుతున్నారు.
Updated Date - 2022-12-15T23:45:21+05:30 IST