ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండల సర్వసభ్య సమావేశం రసాభాస

ABN, First Publish Date - 2022-06-25T06:06:00+05:30

త్రిపురాంతకం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో త్రిపురాంతకం చెరువులో ఎస్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుడు ఆళ్ల ఆంజనేయరెడ్డి కోరారు.

ఎంపీపీ సుబ్బారెడ్డితో వాగ్వాదం చేస్తున్న ఎంపీటీసీ ఆంజనేయరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధి పనుల విషయంలో  త్రిపురాంతకం ఎంపీపీ, 

మాజీ ఎంపీపీ మధ్య వాగ్వాదం

త్రిపురాంతకం, జూన్‌ 24: త్రిపురాంతకం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో త్రిపురాంతకం చెరువులో ఎస్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుడు ఆళ్ల ఆంజనేయరెడ్డి కోరారు. దీంతో ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి కలుగజేసుకుని ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రితోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం తమ పరిధిలో లేదని, అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్నదన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అందులోభాగంగా ‘నువ్వు కూడా ఏడేళ్లు ఎంపీపీగా పని చేశావు కదా ఆసమయంలో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం ఎందుకు చేపట్టలేదు’ అని సుబ్బారెడ్డి ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.  జడ్పీటీసీ జాన్‌పాల్‌ కలుగజేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. వివాదం సద్దుమణగకపో వడంతో ఎంపీడీవోతోపాటు మిగిలిన సభ్యులు సర్ది చెప్పారు. దీంతో ఇద్దరూ తగ్గారు. అధికారులు మాట్లాడుతుండగా నిబంధ నలకు విరుద్ధంగా సమావేశ మందిరంలోకి వచ్చిన విశ్వనాథపురం సర్పం చ్‌ భర్త రంగబాబు పలు సమస్యలపై వివరణ ఇవ్వాలని కోరారు. సభ్యు డు కాని వ్యక్తి సమావేశంలో అధికారులను ప్రశ్నిస్తున్నప్పటికీ ఎంపీడీవో అడ్డుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని మిగిలిన సభ్యులు నిలదీశారు. 

Updated Date - 2022-06-25T06:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising