ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల్లో మేజర్‌

ABN, First Publish Date - 2022-05-16T05:17:47+05:30

ఎర్రగొండపాలెం మేజర్‌ పంచాయతీలో సమస్యలు కూడా మేజ ర్‌గానే ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ వా ర్డుల్లో కాలువల నిర్మాణం జరగలేదు.

ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా హైవే రోడ్డు వద్ద కదలని మురుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వార్డుల్లో లేని కాలువలు

కదలని మురుగు 

ప్రధాన డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు

దోమలతో నరకం చూస్తున్న 

వైపాలెం పట్టణ వాసులు

ఎర్రగొండపాలెం, మే 15 : ఎర్రగొండపాలెం మేజర్‌ పంచాయతీలో సమస్యలు కూడా మేజ ర్‌గానే ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ వా ర్డుల్లో కాలువల నిర్మాణం జరగలేదు. వర్షం, వాడుక నీరు రోడ్లపైనే నిలిచి ఉండిపోతోంది. దీంతో వీధులు కంపుకొడుతున్నాయి. పగలు రాత్రి దోమలతో స్థానికులు నరకం చూస్తు న్నారు. చిన్నపాటి చినుకులకే రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతాయి. వీధి చివర, మూలమలుపు వ ద్ద మురుగు నీరు వారాలు, నెలల తరబడి నిల్వ ఉండిపోవడంతో దోమలు, ఈగలు, విష పరుగులకు ఆవాసకేంద్రంగా మారుతోంది. ఇం దిరానగర్‌ మసీదు బసార్‌లో కాలువలు ఉన్న ప్పటికీ  మురుగునీరు రోజుల తరబడి కా ల్వల్లో  నిల్వ ఉంటుంది. మురుగు నీరు ముం దుకు కదలడంలేదు. హైవే రోడ్డు పక్కన 1000 మీటర్ల పొడవున లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కాలువలు నిర్మించారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కాలువలను ఆక్రమించి భవనాలు, బడ్డీ దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో కాలువ లోపల పేరుకుపోయిన చెత్త, మురుగు తొలగించేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో కాలువలు పారక తీవ్రమైన కంపు కొడుతోంది. దోమల వ్యాప్తి కూడా తీవ్ర మవుతోంది. ప్రజలు జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో కాలువలపై ఆక్రమణలు తొలగించాలని, పారిశుధ్య చర్యలు మెరుగుపరచాలని, దోమల నుంచి కాపాడాలని పట్టణవాసులు మొత్తుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2022-05-16T05:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising