ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడును విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-20T05:17:10+05:30

స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీలలో నగర సమీపంలోని మండవవారిపాలెం పరిధిలో నిర్వహించే మహానాడు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని పార్టీ కార్యాయలంలో టీడీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

మాట్లాడుతున్న దామచర్ల జనార్దన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నాయకులతో దామచర్ల సమావేశం

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 19 : స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీలలో నగర సమీపంలోని మండవవారిపాలెం పరిధిలో నిర్వహించే మహానాడు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని పార్టీ కార్యాయలంలో టీడీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మహానాడు రాష్ట్ర కమిటీకి అనుబంధంగా వివిధ కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఇక్కడ నేతలు పర్యవేక్షించాలన్నారు. అందుకోసం ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యులతో అనుబంధ కమిటీలు వేసినట్లు తెలిపారు. నగర అలంకరణపై ప్రత్యేక సూచనలు చేసిన దామచర్ల, మహానాడులో భోజన, వసతి సదుపాయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. మునిసిపల్‌ మాజీ చైౖర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, పార్టీ పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, వైవీ.సుబ్బారావు, పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-20T05:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising