ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్టకు పైర్లకు జీవం

ABN, First Publish Date - 2022-09-09T05:01:53+05:30

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. మెట్టపైర్లకు జీవం పోసింది. సాదారణంగా ఈనెలలో జిల్లాలో వర్షాలు అధికంగానే పడుతుంటాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఆ ప్రభావం జిల్లాపైనా కనిపించింది. బుధవారం రాత్రి నుంచి అత్యధిక ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.

దోర్నాల ప్రాంతంలో వర్షాలకు కళకళలాడుతున్న పత్తి పైరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా జల్లులు

మరో రెండు రోజులు కురిసే అవకాశం

ఒంగోలు, సెప్టెంబరు 8 (ఆంరఽధజ్యోతి) : జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. మెట్టపైర్లకు జీవం పోసింది. సాదారణంగా ఈనెలలో జిల్లాలో వర్షాలు అధికంగానే పడుతుంటాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఆ ప్రభావం జిల్లాపైనా కనిపించింది. బుధవారం రాత్రి నుంచి అత్యధిక ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొండపిలో అత్యధికంగా 25.50 మి.మీ వర్షపాతం నమోదైంది. కనిగిరిలో 18.50, పి.సి.పల్లిలో 18.25, మర్రిపూడిలో 18.0, జరుగుమల్లిలో 17.50, తాళ్లూరులో 17.0 మి.మీ కురిసింది. ఒంగోలుతో సహా ఇతరచోట్ల జల్లులు పడ్డాయి. తెల్లవారుజాము నుంచే వర్షం ప్రారంభవడంతో జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు ఇక్కట్లు పడ్డారు. తాజా వర్షాలు మెట్ట పంటలకు ఉపకరించనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సుమారు లక్షా ఐదువేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా వాటిలో 90శాతం వరకూ పొలంలో ఉన్నాయి. వాటికి ఈ వర్షాలు ఉపకరించనున్నాయి. ప్రత్యేకించి దాదాపు 39వేల హెక్టార్లలో వేసిన పత్తి, మరో 38వేల హెక్టార్లలో వేసిన కంది పంటలకు మేలు చేయనున్నాయి. మరోరెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - 2022-09-09T05:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising