ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూకబ్జాలను త్వరలో బహిర్గతం చేస్తాం

ABN, First Publish Date - 2022-01-29T04:44:16+05:30

పొదిలి పెద్ద చెరువుకు నీళ్లిస్తామని కాకమ్మకథలు చెబు తూ వైసీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ పే రుతో దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు.

వైసీపీ నాయకులకు సారె పంపుతున్న నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి

మార్కాపురం, జనవరి 28: పొదిలి పెద్ద చెరువుకు నీళ్లిస్తామని కాకమ్మకథలు చెబు తూ వైసీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ పే రుతో దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు.  భూ కబ్జా లను త్వరలో బహిర్గతం చేస్తామని చెప్పా రు. మండలంలోని ప్రతి గ్రామానికి వెలుగొండ జలాలు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఆ యన విలేకరులతో మాట్లాడారు. పొదిలి రెవెన్యూ డివిజన్‌ సాధించా మని వైసీపీ ర్యాలీలు చేశారని అన్నారు. అయితే, రాత్రికి రాత్రి కని గిరికి మారిస్తే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పొదిలిని రెవెన్యూ డి విజన్‌గా చేయాలని మొట్టమొదట ప్రతిపాదనలు ప్రభుత్వానికి తామే పంపామని కందుల పేర్కొన్నారు.  

వైసీపీ నేతలు అనాలోచితంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడు తున్నారన్నారు. నియోజకవర్గంలో 90 శాతం రోడ్లు టీడీపీ హయంలో వేసినవేనన్నారు. టీడీపీ హయాం లో పనులు చేసుకొని, ఇప్పుడు వైసీపీ పంచన చేరిన నా యకు లు ఇప్పుడు టీడీపీ నాయ కులపై ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు. పొదిలి మండల ప్రజ లకు మిమ్మల్ని చీత్కరించుకుం టున్నారని, అందుకే చందాలు వేసుకొని సారె పం పుతున్నట్టు చెప్పారు.  అనంతరం పార్టీలో జిల్లా స్థాయిలో పదవులు వచ్చిన నాయకులు కందుల నారాయణరెడ్డిని సన్మానించారు. 

 కార్యక్రమంలో టీడీపీ మార్కాపురం, పొదిలి పట్టణ అధ్యక్షులు డాక్టర్‌ మౌలాలి, ముల్లా ఖుద్దూస్‌, మార్కాపురం, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామాంజనేయరెడ్డి, మీగడ ఓబులరెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ ముస్లిం మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ రసూల్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్‌ గఫార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T04:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising