ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖోఖో జట్టు ఎంపిక

ABN, First Publish Date - 2022-12-15T23:06:32+05:30

మండలంలోని కంచర్లవారిపల్లి హైస్కూల్‌లో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో జట్టు ఎంపిక గురువారం నిర్వహించినట్లు ఖోఖో సం ఘం పీడీ కాశీవిశ్వనాధరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు.

పామూరు విద్యార్థినులకు యోగా దుస్తులను అందజేస్తున్న ఎంఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, డిసెంబరు 15: మండలంలోని కంచర్లవారిపల్లి హైస్కూల్‌లో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో జట్టు ఎంపిక గురువారం నిర్వహించినట్లు ఖోఖో సం ఘం పీడీ కాశీవిశ్వనాధరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. అండర్‌ 17లో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 17నుంచి 19వ తేదీ వరకు తూ ర్పుగోదావరి జిల్లాలోని కుతుకూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అండర్‌ 14 విభాగంలో ఎంపికైన క్రీడాకారులు జనవరిలో విశాఖ జిల్లా గాజువాకలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పొటీల్లో పాల్గొంటారని, ఉమ్మడి ప్రకాశం జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శులు సుబ్బారావు, విష్ణుప్రసాద్‌ తెలిపారు. గురువారం కేవీపల్లిలో జరిగిన ఖోఖో పోటీలను హెచ్‌ఎం అనురాధ ప్రారంభించగా, క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యోగాలో పామూరు విద్యార్థినుల ప్రతిభ

పామూరు : ఒంగోలులోని మిని స్టేడియంలో ఈనెల 14న జరిగిన యోగా పోటీల్లో పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు షేక్‌ సన, పి.దివ్య జిల్లా జట్టుకు ఎంపికైనట్లు ఎంఈవో రవీంద్రనాథ్‌, వ్యాయామ ఉపాధ్యాయిని మస్తాని గురువారంం తెలిపారు. గురువారం విద్యార్థినులను అభినందించారు. ఈ నెల 22, 23 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తెలుగు మీడియం విధ్యార్థులు రూ.3 యోగా దుస్తులు, మ్యాట్‌లను బహుమతిగా అందచేసారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక

పీసీపల్లి : రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు గుంటుపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థినులు ముగ్గురు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఎంవీ శివకుమార్‌ తెలిపారు. అండర్‌-17 విభాగానికి బి.షణ్ముకరెడ్డి, ఎస్‌.లక్ష్మీమాధురి, అండర్‌-14కు కె.లక్ష్మీపవిత్ర ఎంపికయ్యారు. ముగ్గురు బాలికలను హెచ్‌ఎం శివకుమార్‌, పీటీ సుజాత, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2022-12-15T23:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising